Alur: ఆలూరు నూతన ఎంపీటీసీ లక్ష్మీదేవి ఆకస్మిక మృతి
Alur: కర్నూలు జిల్లా ఆలూరు 4వ ఎంపీటీసీగా గెలిచిన టీడీపీ నేత లక్ష్మీదేవి ఆకస్మిక మృతి. తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన నియోజకవర్గ ఇన్చార్జ్ వైకుంఠం జ్యోతి.
Alur: ఆలూరు నూతన ఎంపీటీసీ లక్ష్మీదేవి ఆకస్మిక మృతి
ఆలూరు: కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గంలో విషాదం చోటుచేసుకుంది. మన్న జరిగిన జడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికల్లో ఆలూరు 4వ ఎంపీటీసీ అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించిన టీడీపీ నాయకురాలు లక్ష్మీదేవి ఆకస్మికంగా మృతి చెందారు.
రెండు రోజుల క్రితం జరిగిన ఎంపీటీసీ ఎన్నికల ఓట్ల లెక్కింపులో వైఎస్సార్సీపీ అభ్యర్థిపై లక్ష్మీదేవి విజయం సాధించారు. విజయం సాధించిన కొద్ది రోజులకే ఆమె మృతి చెందడంతో టీడీపీ శ్రేణుల్లో విషాదం నెలకొంది.
లక్ష్మీదేవి మృతి పట్ల ఆలూరు టీడీపీ నియోజకవర్గ ఇంచార్జ్ వైకుంఠం జ్యోతి తీవ్ర దిగ్భ్రాంతి, ఆవేదన వ్యక్తం చేశారు. మృతురాలి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ, ఈ విషాద సమయంలో కుటుంబానికి మనోధైర్యం కలగాలని ఆకాంక్షించారు.




