Alur: హులేబీడులో ఆలూరు పోలీసుల అవగాహన సదస్సు

Alur: కర్నూలు జిల్లా హులేబీడు గ్రామంలో ఆలూరు సీఐ రవిశంకర్ రెడ్డి ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జరిగింది. బన్నీ ఉత్సవాలు, సైబర్ నేరాలపై ప్రజలకు దిశా నిర్దేశం చేశారు.

Bheemalinga, Aluru
Published on: 12 Oct 2026 8:26 PM IST
Alur
X

Alur: హులేబీడులో ఆలూరు పోలీసుల అవగాహన సదస్సు

ఆలూరు: కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గ పరిధిలోని హులేబీడు గ్రామంలో ప్రజలకు వివిధ అంశాలపై ఆలూరు పోలీసులు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆలూరు సీఐ రవిశంకర్ రెడ్డి, ఎస్‌ఐ మన్మద విజయ్‌తో పాటు పోలీసు సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రజలకు పలు సూచనలు చేశారు.

ఈ సందర్భంగా రాబోయే దసరా బన్నీ ఉత్సవాన్ని ప్రశాంత వాతావరణంలో నిర్వహించుకోవాలని, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావివ్వకుండా పోలీసులకు సహకరించాలని సూచించారు. అలాగే బాల్యవివాహాల నివారణ, మహిళల పట్ల అసభ్య ప్రవర్తన, మహిళలపై నేరాలు, సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు వివరించారు.

బాల్యవివాహాల సమాచారం కోసం 1098, సైబర్ మోసాలకు గురైతే 1930, అత్యవసర పోలీసు సహాయం కోసం 112 నంబర్లను సంప్రదించాలని తెలిపారు. ఇక ఐవీఆర్‌ఎస్ కాల్స్ పట్ల అవగాహన, మాదకద్రవ్యాల నివారణ, మద్యం సేవించి వాహనాలు నడపడం వల్ల కలిగే ప్రమాదాలు, దొంగతనాల నివారణ, రహదారి భద్రత వంటి అంశాలపై ప్రజలకు అవగాహన కల్పించారు.

అదేవిధంగా రానున్న స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ప్రజలు శాంతియుత వాతావరణాన్ని కాపాడుతూ, చట్టాలకు లోబడి వ్యవహరించాలని పోలీసులు సూచించారు. ప్రజల భద్రతే లక్ష్యంగా, నేరాల నివారణకు ప్రతి ఒక్కరూ పోలీసులకు సహకరించాలని ఈ సందర్భంగా ఆలూరు పోలీసులు

Bheemalinga, Aluru

Bheemalinga, Aluru