Alur: తుంగభద్ర డ్యాం నూతన గేట్ల ప్రారంభోత్సవానికి ఆలూరు నుండి భారీ కాన్వాయ్!
Alur: కర్నూలు జిల్లా ఆలూరు టీడీపీ ఇన్‌ఛార్జ్ వైకుంఠం జ్యోతి ఆధ్వర్యంలో 100 వాహనాలతో కూడిన భారీ కాన్వాయ్ తుంగభద్ర డ్యాంకు బయలుదేరింది.
Alur: తుంగభద్ర డ్యాం నూతన గేట్ల ప్రారంభోత్సవానికి ఆలూరు నుండి భారీ కాన్వాయ్!
Alur: కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గ తెలుగు దేశం పార్టీ ఇన్‌ఛార్జ్ వైకుంఠం జ్యోతి ఆధ్వర్యంలో తుంగభద్ర డ్యాం నూతన గేట్ల ప్రారంభోత్సవ కార్యక్రమానికి భారీ కాన్వాయ్‌తో బయలుదేరారు. కర్ణాటక రాష్ట్రంలోని హోస్పేట్ సమీప తుంగభద్ర డ్యాం వద్ద నిర్వహిస్తున్న ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఆలూరు నియోజకవర్గం నుంచి పెద్ద ఎత్తున పార్టీ నాయకులు, కార్యకర్తలు తరలివెళ్లారు.
సుమారు 100 వాహనాలతో కూడిన భారీ కాన్వాయ్‌లో టీడీపీ శ్రేణులు ఉత్సాహంగా బయలుదేరి వెళ్లడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ సందర్భంగా టిడిపి ఇన్చార్జ్ వైకుంఠం జ్యోతి మాట్లాడుతూ గతంలో తుంగభద్ర డ్యాం గేట్లు కొట్టుకుపోవడంతో రైతులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. కూటమి ప్రభుత్వం వెంటనే స్పందించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సీనియర్ ఇంజనీర్ కన్నయ్య నాయుడుతో మాట్లాడి డ్యాంలో నీరు నిల్వ ఉన్నా కూడా, తాత్కాలిక గేట్లను అమర్చారన్నారు.
అనంతరం దాదాపు 19 గేట్లను ఇది కర్ణాటక, ఆంధ్ర, తెలంగాణ ప్రభుత్వాలు కలిసి ఎంతో ప్రతిష్టాత్మకంగా 19 కొత్త గేట్లను ఏర్పాటు చేసి నేడు మూడు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సమక్షంలో ప్రారంభోత్సవం జరగబోతుందన్నారు. శాశ్వత నూతన గేట్ల ఏర్పాటు రైతాంగానికి, సాగునీటి రంగానికి ఎంతో మేలు చేస్తుందని పేర్కొన్నారు.
తుంగభద్ర డ్యాం ఆధునీకరణ పనులు పూర్తవడం సంతోషకర విషయమని, ఈ ప్రాజెక్టు ద్వారా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ కర్ణాటక రాష్ట్రాల రైతులకు మరింత ప్రయోజనం చేకూరుతుందని అన్నారు. కార్యక్రమంలో ఆలూరు నియోజకవర్గ పరిశీలికులు తలారి ఆదినారాయణ, రాష్ట్ర నాయకులు వైకుంఠం శివప్రసాద్ , మాజీ జెడ్పిటిసి మీనాక్షి నాయుడు, టీడీపీ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.




