Kurnool: మహానాడు ముందస్తు హడావుడి.. ఏర్పాట్లపై వైకుంఠం జ్యోతి సమీక్ష!
Kurnool: కర్నూలు జిల్లా ఆలూరు టీడీపీ కార్యాలయంలో మే 27, 28 తేదీల్లో జరగనున్న 'మహానాడు' వేడుకలను విజయవంతం చేయడంపై విస్తృత స్థాయి సమీక్షా సమావేశం జరిగింది.
Kurnool: మహానాడు ముందస్తు హడావుడి.. ఏర్పాట్లపై వైకుంఠం జ్యోతి సమీక్ష!
Kurnool: కర్నూలు జిల్లా ఆలూరు టిడిపి కార్యాలయంలో ఈ నెల 27, 28 తేదీల్లో జరగనున్న తెలుగు దేశం పార్టీ మహానాడు కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు విస్తృత స్థాయి ఏర్పాట్లపై సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ఆలూరు టిడిపి ఇంచార్జ్ వైకుంఠం జ్యోతి అధ్యక్షత వహించారు. కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఆలూరు నియోజకవర్గ పరిశీలకులు తలారి ఆదినారాయణ పాల్గొన్నారు. ముందుగా నియోజవర్గంలోని సీఎం రిలీఫ్ ఫండ్ పేద ప్రజలకు 18 మంది లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేశారు.
సీఎం రిలీఫ్ ఫండ్ పేద ప్రజలకు ఎంతో ఉపయోగపడుతుందని గత ప్రభుత్వాలు ఇంత పెద్ద మొత్తాలలో ఇవ్వలేదని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత పార్టీలకు అతీతంగా నియోజవర్గానికి నేను ఇంచార్జ్ అయిన తర్వాత ఒక కోటి 94 లక్షలు రూపాయలు సీఎం రిలీఫ్ ఫండ్ మంజూరు చేశారని వారికిj నియోజవర్గం తరఫున వారికి కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం 27 28వ తేదీన జరగబోయే మహానాడు కు నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో మహానాడు ప్రత్యక్ష ప్రసారాన్ని ప్రజలకు చేరవేసేలా డిజిటల్ స్క్రీన్ల ఏర్పాటు, కార్యకర్తల సమన్వయం, గ్రామ స్థాయి ప్రచార కార్యక్రమాలపై క్లస్టర్ ఇంచార్జులు, మండల కన్వీనర్లతో చర్చించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ మహానాడు పార్టీకి అత్యంత ప్రతిష్టాత్మక కార్యక్రమమని, ప్రతి కార్యకర్త బాధ్యతగా తీసుకుని విజయవంతం చేయాలని వైకుంఠం జ్యోతి పిలుపునిచ్చారు. ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లే వేదికగా మహానాడు నిలవనుందని పేర్కొన్నారు. అలాగే తలారి ఆదినారాయణ మాట్లాడుతూ నాయకులు, కార్యకర్తలు సమిష్టిగా పనిచేసి మహానాడును జయప్రదం చేయాలని కోరారు. నియోజకవర్గ వ్యాప్తంగా భారీ ఎత్తున ప్రజల భాగస్వామ్యం అయ్యేలా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సూచించారు.
ఈ సమావేశంలో టిడిపి రాష్ట్ర నాయకుడు వైకుంఠం శివప్రసాద్, టిడిపి నాయకులు, క్లస్టర్ ఇంచార్జులు, మండల కన్వీనర్లు, కార్యకర్తలు పాల్గొన్నారు.




