Alur: ఆలూరులో వైస్సార్సీపీ బూత్ మీటింగ్

Alur: ఎమ్మెల్యే విరుపాక్షి, ఎస్వీ మోహన్ రెడ్డి దిశానిర్దేశం.. కూటమి నేతలు ఓట్లు తొలగించకుండా అప్రమత్తంగా ఉండాలని పిలుపు, సూపర్ సిక్స్ వైఫల్యాలపై ధ్వజం.

Bheemalinga, Aluru
Published on: 30 May 2026 5:26 PM IST
Alur
X

Alur: ఆలూరులో వైస్సార్సీపీ బూత్ మీటింగ్

ఆలూరు: వైస్సార్సీపీ బూత్ లెవెల్స్ మీటింగ్ నిర్వహించారు.ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే విరుపాక్షి, జిల్లా అధ్యక్షుడు ఎస్ వి మోహన్ రెడ్డి పాల్గొన్నారు.రాబోయే స్థానిక ఎన్నికల్లో మన పార్టీ సత్తా సత్తా చాటడానికి దశ దిశ కార్యకర్తలకు నిర్దేశించారు.

స్థానిక ఎన్నికల్లో ప్రతి గ్రామంలో మన కార్యకర్త గెలవడానికి సాయి శక్తులకు కృషి చేయాలంటే ముందుగా మన ఓట్లు ఉన్నాయా లేవా ముందుగా తెలుసుకోవాలి అని మనం ఏమాత్రం నిర్లక్ష్యంగా ఉన్న మన ఓట్లు మనకు తెలియకుండా తొలగించడానికి కూటినేతలు ప్రయత్నాలు చేస్తున్నారన్నారు.

రాష్ట్రంలో సంక్షేమం అభివృద్ధి ని అందించిన పార్టీ వైసిపి అదే మీ పార్టీ వెన్నుపోటు పార్టీ అంటారు ఎందుకంటే సూపర్ సిక్స్ పథకాలలో రెండు పథకాలు అందించలేక అక్కాచెల్లెమ్మలను నిరుద్యోగ యువతను మోసం చేసిన పార్టీ మీదే వెన్నుపోటు పార్టీ అన్నారు. జగన్మోహన్ రెడ్డి మాటిచ్చిన ప్రకారం సంక్షేమ పథకాలను అందించిన వ్యక్తి అన్నారు .

అదేవిధంగా ప్రజల ముంగిటికే సచివాలయం తీసుకొచ్చి ప్రజా సమస్యలను తీర్చారు.మిగతా రాష్ట్రంలో ప్రజలను మీ సచివాలయం ఎక్కడ అని అడిగితే మా సచివాలయం బెంగళూరు,మద్రాస్, హైదరాబాద్ అని చెబుతారు. మన రాష్ట్రంలో మీ సచివాలయం ఎక్కడ అని అడిగితే మా ఇంటి పక్కనే ఉంది అని చెబుతారు అది జగన్మోహన్ రెడ్డి పాలన.

Bheemalinga, Aluru

Bheemalinga, Aluru

Next Story