Banaganapalle: అయ్యప్ప, శివ స్వాములకు బిక్ష: కాటసాని రమాకాంత్ రెడ్డి
Banaganapalle: బనగానపల్లె రవ్వలకొండ వీరబ్రహ్మేంద్రస్వామి ఆలయంలో అయ్యప్ప, శివ స్వాములు సహా 400 మందికి మాజీ సర్పంచ్ కాటసాని రమాకాంత్ రెడ్డి అన్నదానం నిర్వహించారు.
Banaganapalle: అయ్యప్ప, శివ స్వాములకు బిక్ష: కాటసాని రమాకాంత్ రెడ్డి
నంద్యాల జిల్లా: బనగానపల్లె సమీపంలోని రవ్వలకొండ లో వెలసిన శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి ఆలయంలో అయ్యప్ప. శివ. స్వాములు మరియు భక్తులకు మొత్తం దాదాపు 400 మంది అన్నదానం కార్యక్రమం నిర్వహించిన గుండ్ల శింగవరం మాజీ సర్పంచ్ కాటసాని రమాకాంత్ రెడ్డి
కాటసాని రమాకాంత్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ రవ్వలకొండలో పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి ఆలయంలో వచ్చిన భక్తులకు గత 11 సంవత్సరాల నుంచి తన అబ్బగారైన కాటసాని శివారెడ్డి ఆలయనికి వచ్చిన భక్తులకు నిత్య అన్నదానం ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
గురువారం ప్రత్యేకంగా అయ్యప్ప స్వాములు శివ స్వాములు. మరియు వచ్చిన భక్తులకు దాదాపు 400 మందికి అయ్యప్ప మాలధారణ వేసిన స్వాములకు ప్రత్యేకంగా బిక్ష ఏర్పాటు చేసినట్లు గుండ్ల శింగవరం మాజీ సర్పంచ్ కాటసాని రమాకాంత్ రెడ్డి తెలిపారు.




