Markapuram: మార్కాపురం శ్రీ సాధన కళాశాలలో డ్రగ్స్‌పై అవగాహన సదస్సు!
Markapuram: మార్కాపురం శ్రీ సాధన డిగ్రీ కళాశాలలో డ్రగ్స్ వ్యతిరేక అవగాహన కార్యక్రమం.. పాల్గొన్న ఈగల్ టీమ్ ఇన్‌స్పెక్టర్ జి. దేవుళ్లు, సీఐ అల్తాఫ్ హుస్సేన్.
Markapuram: మార్కాపురం శ్రీ సాధన కళాశాలలో డ్రగ్స్‌పై అవగాహన సదస్సు!
Markapuram: మార్కాపురంలోని శ్రీ సాధన డిగ్రీ కళాశాలలో ప్రిన్సిపాల్ డాక్టర్ కప్పగంతుల మధుసూదన్ పర్యవేక్షణలో డ్రగ్స్ వ్యతిరేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి మార్కాపురం, ప్రకాశం, నెల్లూరు జిల్లాల ఈగల్ టీమ్ ఇన్‌స్పెక్టర్ జి. దేవుళ్లు, మార్కాపురం సీఐ ఎండీ అల్తాఫ్ హుస్సేన్, ఎస్‌ఐ పి. విశ్వనాథ రెడ్డి హాజరయ్యారు.
డ్రగ్స్ వినియోగం వల్ల కలిగే శారీరక, మానసిక, సామాజిక అనర్థాలను అధికారులు విద్యార్థులకు వివరించారు. డ్రగ్స్‌కు బానిసైతే విద్య, ఆరోగ్యం, భవిష్యత్తుతో పాటు కుటుంబ సంబంధాలపై తీవ్ర ప్రభావం పడుతుందని ఈగల్ టీమ్ ఇన్‌స్పెక్టర్ జి. దేవుళ్లు తెలిపారు.
యువత డ్రగ్స్‌కు ఆకర్షితులు కాకుండా అప్రమత్తంగా ఉండాలని సూచిస్తూ.. ఈగల్ టీమ్ నిర్వహించే ఐదు రకాల ఆపరేషన్ల గురించి వివరించారు. అనంతరం విద్యార్థులతో డ్రగ్స్‌కు వ్యతిరేకంగా ప్రతిజ్ఞ చేయించారు.
డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణంలో యువత కీలక పాత్ర పోషించాలని సీఐ అల్తాఫ్ హుస్సేన్ పిలుపునిచ్చారు. విద్యార్థులు తమ ఆరోగ్యం, భవిష్యత్తుపై బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు. కార్యక్రమంలో కళాశాల వైస్ ప్రిన్సిపాల్ పి. శ్రీధర్ కుమార్, SAC సమన్వయకర్త డాక్టర్ ఎం. శేషు కుమార్, TPO కె.వి.ఎస్.ఆర్. పవన్ కుమార్, అధ్యాపకులు, అధ్యాపకేతర సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.




