Kurnool: కర్నూలు జూనియర్ కాలేజీలో మాదక ద్రవ్యాల వ్యతిరేక కార్యక్రమం!
Kurnool: కర్నూలు ప్రభుత్వ వృత్తి విద్యా జూనియర్ కళాశాలలో మాదక ద్రవ్యాల వ్యతిరేక అవగాహన సదస్సు నిర్వహించారు.
Kurnool: కర్నూలు జూనియర్ కాలేజీలో మాదక ద్రవ్యాల వ్యతిరేక కార్యక్రమం!
కర్నూలు: ప్రభుత్వ వృత్తి విద్యా జూనియర్ కళాశాలలో ప్రభుత్వ ఆదేశాలు మరియు జిల్లా కలెక్టర్ గారి సూచనల మేరకు “డ్రగ్స్ వద్దు బ్రో.. చదువు ముద్దు బ్రో” అనే నినాదంతో మాదక ద్రవ్యాల వ్యతిరేక అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమం కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎస్. నాగస్వామి నాయక్ (గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ హోల్డర్) గారి ఆధ్వర్యంలో నిర్వహించబడింది.
కార్యక్రమానికి SETKUR CEO డాక్టర్ శ్రీ వేణుగోపాల్ మరియు ఈగల్ టీమ్ సభ్యులు వై. ఎల్లీషా, ఎస్. మసూమ్ వలి, బి. రమేష్ హాజరై విద్యార్థులకు మాదక ద్రవ్యాల వినియోగం వల్ల కలిగే శారీరక, మానసిక మరియు సామాజిక నష్టాలపై అవగాహన కల్పించారు.
సందర్భంగా వారు మాట్లాడుతూ.. యువత దేశ భవిష్యత్తుకు పునాదులని, చెడు అలవాట్లకు ఆకర్షితులు కాకుండా క్రమశిక్షణతో చదువుపై దృష్టి పెట్టాలని సూచించారు. మాదక ద్రవ్యాల వల్ల జీవితంలో ఎదురయ్యే సమస్యలు, కుటుంబాలపై పడే ప్రభావం, ఆరోగ్య పరమైన ఇబ్బందుల గురించి వివరించారు. ప్రతి విద్యార్థి మంచి లక్ష్యాలను ఏర్పరచుకొని సమాజానికి ఆదర్శంగా నిలవాలని పిలుపునిచ్చారు.
కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎస్. నాగస్వామి నాయక్ మాట్లాడుతూ విద్యార్థి దశ ఎంతో ముఖ్యమైనదని, ఈ దశలో సరైన నిర్ణయాలు తీసుకొని విద్య, నైపుణ్యాభివృద్ధి వైపు ముందుకు సాగాలని తెలిపారు. యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉంటే ఆరోగ్యకరమైన మరియు అభివృద్ధి చెందిన సమాజాన్ని నిర్మించవచ్చని పేర్కొన్నారు.
కార్యక్రమంలో కళాశాల సిబ్బంది మల్లికార్జున, విజయశేఖర్, రామకృష్ణ, కృష్ణమోహన్, చిన్న మల్లేష్, సారధి పటేల్, ఉల్గోజి రావు, సోమేష్, శ్రీధర్ మూర్తి, బాల శంకర్ మరియు విద్యార్థులు పాల్గొన్నారు. మాదక ద్రవ్య రహిత సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సందేశంతో కార్యక్రమం విజయవంతంగా ముగిసింది.




