Atmakur: సీమ ప్రాజెక్టులకు సాగునీటి షెడ్యూల్ ఖరారు
Atmakur: రాయలసీమ సాగునీటి ప్రాజెక్టులకు రాబోయే ఖరీఫ్ సీజన్ నీటి విడుదల షెడ్యూల్‌ను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఖరారు చేసింది.
Atmakur: సీమ ప్రాజెక్టులకు సాగునీటి షెడ్యూల్ ఖరారు
Atmakur: రాబోయే ఖరీఫ్ వ్యవసాయ సీజన్ కు రాయలసీమ ప్రాజెక్టులకు సాగునీటిని విడుదల చేసే తేదీలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఖరారు చేసింది. 2026 - 27 వర్ష సంవత్సరంలో ఏ ఏ మాసాలలో ఏ తేదీలలో కృష్ణ, తుంగభద్ర వరద జనాలను ఎంత మేర విడుదల చేయాలని ప్రణాళికలను జల వనరుల, వ్యవసాయ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు ఖరారు చేశారు. రాయలసీ అన్ని సాగునీటి ప్రాజెక్టులకు ఈ ఏడాది 122 టిఎంసిల జలాలను అందించేందుకు ఆయా జిల్లాల సాగునీటి ఇంజనీర్లతో చర్చించి ప్రణాళిక సిద్ధం చేశారు.
రాయలసీమ సాగునీటి ప్రాజెక్టుల ముఖద్వారం పోతిరెడ్డిపాడు రెగ్యులేటర్, మల్యాల, ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకాల నుంచి సాగునీటిని విడుదల చేస్తారు. జూన్ 10 వ తేదీన గాలేరు - నగరి సుజల స్రవంతి పథకానికి, జూన్ 15న తెలుగు గంగ పథకంలో భాగమైన పోతులూరి వీర మహేంద్ర స్వామి రిజర్వాయర్ కడప ఆయకట్టుకు, జులై 20న కేసి కెనాల్, తెలుగు గంగ, ఎస్ ఆర్ బి సి, తుంగభద్ర దిగువ కాలువ, జూలై 31న హంద్రీ - నీవా సుజల స్రవంతి పథకాలకు నీటిని విడుదల చేసేందుకు జలవంతరాల శాఖ సిద్ధపడింది.
ఈనెల జూన్ 10 నుంచి జులై 31 వరకు 50 రోజుల వరద దినాల్లో 122 టీఎంసీల నీటిని రాయలసీమ జిల్లాలకు అందించేందుకు షెడ్యూల్డ్ సిద్ధం చేశారు. ఇదిలా ఉంటే నీ ఏడాది రుతుపవనాలు సకాలంలో రాష్ట్రంలో ప్రవేశించినా సూపర్ ఎల్ నినో ప్రభావంతో వర్షాలు తక్కువగా కురువచ్చని వాతావరణ శాఖ శాస్త్రీయ అంచనాలు వేస్తుంది. ఇదిలా ఉంటే సాగు నీటిని అందించే కీలక ప్రాజెక్టులైన పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్, బనకచర్ల నీటి నియంత్రణ సముదాయం గేట్ల మరమ్మతులు ఇంకా పూర్తి కాలేదు. ఈసారి కృష్ణా నదికి వరదలు అవుతాయని జలవనరుల శాఖ అధికారులు భావిస్తున్నారు.
ఇప్పటికే ఆల్మట్టి, నారాయణపూర్, జూరాల, శ్రీశైలం, నాగార్జునసాగర్, జలాశయాలు అడుగంటి డెడ్ స్టోరేజీ స్థాయికి నీటి మట్టాలు పడిపోయాయి. తుంగభద్ర నదికి వరద జలాల ప్రవాహం ఎప్పుడు మొదలవుతుందో అంచనాలు వేయలేకపోతున్నారు. ఏది ఏమైనా ఖరీఫ్ వ్యవసాయానికి భూములను దక్కి దున్నుకొని రాయలసీమ అన్నదాతలు రుతుపవనాల రాక కోసం ఎదురుచూస్తూ .. మరోవైపు కృష్ణ, తుంగభద్ర ప్రాజెక్టులు వరద నీటితో ఎప్పుడు నిండుతాయా అని నిరీక్షిస్తున్నారు.




