Atmakur: రాయలసీమ రైతులకు సర్కార్ తీపి కబురు
Atmakur: రాయలసీమ సాగునీటి ప్రాజెక్టుల మరమ్మతులకు ఏపీ ప్రభుత్వం రూ. 42.78 కోట్లు మంజూరు చేసింది.
Atmakur: రాయలసీమ రైతులకు సర్కార్ తీపి కబురు
Atmakur: రాయలసీమ సాగునీటి ప్రాజెక్టులకు నీటినందించే ప్రధాన కాల్వల మరమ్మతులకు ఎట్టకేలకు రాష్ట్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. రాష్ట్ర జలవనరుల శాఖ పరిధిలో నంద్యాల, కర్నూలు జిల్లాలలో సాగునీటిని వ్యవసాయ భూములకు మళ్లించే కాలువలు, డిస్ట్రిబ్యూటరీలు, ప్రధాన కాలువల లైనింగ్ మరమ్మతులు, అక్విడేట్ వంతెనల నిర్మాణం, మరమ్మతులకు రాష్ట్ర ప్రభుత్వం రూ. 42. 78 కోట్లను విడుదల చేస్తూ వచ్చేవారం నుంచి పనులు ప్రారంభించేలా టెండర్లు పూర్తి చేయాలని ఉమ్మడి కర్నూలు జిల్లా జల వనరుల శాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేసింది.
శ్రీశైలం ప్రాజెక్టు ఆధారిత ఎస్ ఆర్ బి సి పరిధిలోని మూడు నియోజకవర్గాల్లో 83 పనులకు రూ. 13 కోట్లు కేటాయించారు. శ్రీశైలం నియోజకవర్గ వెలుగోడు పరిధిలో వి.బి.ఆర్ వంటకాలువల మరమ్మతులకు రూ. 1.20 కోట్లు వెచ్చిస్తారు. శ్రీశైల జలాశయ ఆనకట్ట పరిధిలో పనులకు 4.34 కోట్లు, కేసీ కెనాల్ మరమ్మతులకు, నంద్యాల, శ్రీశైలం, ఆళ్లగడ్డ నియోజకవర్గాల్లో 80 పనులకు రూ. 7.17 కోట్లు విడుదల చేశారు. మొత్తం పై నంద్యాల జిల్లాలో 271 పనులకు రూ. 26.03 కోట్లు, కర్నూలు జిల్లాలో 140 పనులకు రూ. 13.86 కోట్ల నిధులు మంజూరయ్యాయి.. నీ నిర్మాణాలన్నింటినీ ఈ ఏడాది నీటి సంవత్సరం ప్రారంభం అయ్యేలోగా పూర్తిచేయాలని రాష్ట్ర జలవనరుల శాఖ ఆదేశించింది.




