Alur: ఆలూరు సస్యాశామలం కావాలంటే రిజర్వాయర్లు కట్టాల్సిందే!

Alur: ర్నూలు జిల్లా ఆలూరు ప్రాంత నీటి కష్టాలను తీర్చడానికి వేదవతి, నగరడోన రిజర్వాయర్లను వెంటనే పూర్తి చేయాలని ఏపీ రైతు సంఘం డిమాండ్ చేసింది.

Bheemalinga, Aluru
Published on: 10 May 2026 5:27 PM IST
Alur
X

Alur: ఆలూరు సస్యాశామలం కావాలంటే రిజర్వాయర్లు కట్టాల్సిందే!

ఆలూరు: కర్నూలు జిల్లా ఆలూరు ప్రాంత ప్రజలకు త్రాగు,సాగు నీరు పరిష్కారానికి ఏకైక మార్గం పెండింగ్లో ఉన్న వేదవతి,నగరడోన రిజర్వాయర్ లను పూర్తి చేస్తేనే సస్యాశామలం అవుతుందని ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి పై దశల వారి పోరాటాలు చేస్తున్నట్లు ఏపి రైతు సంఘం(ఏఐకెఎస్)జిల్లా సహాయ కార్యదర్శి పి. హనుమంతు తెలిపారు.ఆదివారం ఆలూరు జ్యోతిబసు భవన్ లో ఏపి రైతు సంఘం మండల మహాసభ పరమేష్ గౌడ్ అధ్యక్షతన జరిగింది.ఈ మహా సభనుద్దేశించి పి.హనుమంతు మాట్లాడుతూ అభివృద్ధికి నోచని ఆలూరు ప్రాంత ప్రజలు నిత్యం సుగ్గి బాట పడుతూ ప్రణాలను అరిచేతిలో పెట్టుకొని తట్ట బుట్ట సర్దుకొని సుదూర ప్రాంతాలకు వెళ్లి జీవనం చేస్తూ ప్రాణాలు పోగొట్టుకున్న ఎందరో రైతులు,వ్యవసాయ కూలీలు,కార్మికులు ఉన్నారన్నారు.నియోజకవర్గంలో రైతులు అధికంగా వర్షదారం పై పంటలు పండిస్తున్న సమయానికి వర్షాలు లేక పంటలు పండక అప్పుల పాలవుతున్నారని తెలిపారు.

త్రాగు నీరు 10 నుండి 15 రోజులకు అందిస్తున్నారంటే ఎంత కరువు కాటకాలో ఉన్నామో తెలుస్తుందన్నారు. యువతకు ఉపాధి లేదు, రైతుకు పంటపండదు, కూలీలకు పనిలేదు వీటన్నిటిని నుండి బయట పదాలంటే సాగు,త్రాగు నీరు కావాలి అందుకు ప్రభుత్వ మెడలు వంచి వేదవతి,నగరడోన రిజర్వాయర్ లను నిర్మించుకుంటే ఆలూరు ప్రాంతం సస్యాశామలం అవుతుందన్నారు.కావున వామపక్ష పార్టీలు, కలిసోచ్చే ఇతర పార్టీలు,ప్రజాసంఘాల ఆధ్వర్యంలో దశలవారి పోరాటాలు చేస్తున్నట్లు తెలిపారు. అందుకు ప్రజలు,రైతులు,యువతి యువకులు కలసిరావాలని పిలుపునిచ్చారు.ఏపి రైతు సంఘం మండల కార్యదర్శి ఈరన్న, వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు క్రిష్ణ,రంగస్వామి, వెంకటేశ్వర్లు, నారాయణ, నగరడోన గోపాల్,చంద్ర,శివయ్య,సిద్దప్ప,అగ్రహారం వెంకటేశులు పాల్గొన్నారు.

Bheemalinga, Aluru

Bheemalinga, Aluru

Next Story