Giddalur: గిద్దలూరులో ఏపీజీబీ విజిలెన్స్ అవగాహన సదస్సు

Giddalur: విజిలెన్స్ వారోత్సవాల్లో భాగంగా గిద్దలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ ఆధ్వర్యంలో పండ్ల పంపిణీ, మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించారు.

PATTAN YAKUB KHAN, GIDDALURU
Published on: 11 Nov 2026 9:41 PM IST
Giddalur
X

Giddalur: గిద్దలూరులో ఏపీజీబీ విజిలెన్స్ అవగాహన సదస్సు

Giddalur: ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్, గిద్దలూరు మెయిన్ బ్రాంచ్ విజిలెన్స్ అవగాహన వారోత్సవాల్లో భాగంగా గిద్దలూరు ప్రభుత్వ ఆసుపత్రి ప్రాంగణంలో అవగాహన కార్యక్రమం నిర్వహించబడింది.

ఈ కార్యక్రమం ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ మార్కాపురం ప్రాంతీయ మేనేజర్ వెంకటేశ్వర్లు, గిద్దలూరు మెయిన్ బ్రాంచ్ చీఫ్ మేనేజర్ శ్రీ పి. రామోహన్, ఆధ్వర్యంలో జరిగింది. గిద్దలూరు ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ ఆదం, మెడికల్ ఆఫీసర్ కె.వి. రమణారెడ్డి , ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిదులుగా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ప్రభుత్వ ఆసుపత్రి ప్రాంగణంలో మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించారు. పర్యావరణ పరిరక్షణ, పచ్చదనం పెంపొందించడం మరియు మొక్కల ప్రాముఖ్యతపై అవగాహన కల్పించారు.

అదేవిధంగా, ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ తరఫున ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగులకు పండ్లు మరియు బ్రెడ్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమం ద్వారా రోగులకు సేవాభావంతో సహాయం అందిస్తూ బ్యాంకు తన సామాజిక బాధ్యతను చాటుకుంది.

అనంతరం ప్రాంతీయ మేనేజర్ ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ అందిస్తున్న వివిధ రకాల రుణ పథకాలు, బ్యాంకింగ్ సేవలు మరియు ఖాతాదారులకు అందుబాటులో ఉన్న ప్రయోజనాలను వివరించారు. ప్రజలు బ్యాంకు అందిస్తున్న వివిధ సేవలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

ముఖ్యంగా బ్యాంకు ప్రవేశపెట్టిన ఫెస్టివ్ వైబ్ (Festive Vibe) పథకం గురించి వివరిస్తూ, ఈ పథకం కింద అర్హత కలిగిన రుణాలకు ఎటువంటి ప్రాసెసింగ్ ఫీజు లేకుండా రుణాలు మంజూరు చేయబడుతున్నాయని తెలియజేశారు.

ఈ కార్యక్రమం ద్వారా ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ ఆర్థిక అవగాహన పెంపొందించడంతో పాటు, ఖాతాదారులకు మెరుగైన బ్యాంకింగ్ సేవలు అందించడం, పర్యావరణ పరిరక్షణ మరియు సమాజ సేవ పట్ల తన నిబద్ధతను చాటుకుంది.

PATTAN YAKUB KHAN, GIDDALURU

PATTAN YAKUB KHAN, GIDDALURU