Kurnool: కర్నూలు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో అబ్దుల్ కలాం వర్ధంతి నిర్వణ

Kurnool: కర్నూలులోని ప్రభుత్వ వృత్తి విద్యా కళాశాలలో ప్రిన్సిపాల్ నాగస్వామి నాయక్ ఆధ్వర్యంలో అబ్దుల్ కలాం వర్ధంతి జరిపి, ఆయన చిత్రపటానికి నివాళులర్పించారు.

V RAMAMOHAN, KURNOOL
Published on: 27 July 2026 2:09 PM IST
Kurnool
X

Kurnool: కర్నూలు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో అబ్దుల్ కలాం వర్ధంతి నిర్వణ

కర్నూలు: ప్రభుత్వ వృత్తి విద్యా జూనియర్ కళాశాలలో భారత మాజీ రాష్ట్రపతి, ప్రముఖ శాస్త్రవేత్త, "మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా" డాక్టర్ ఏ.పి.జె. అబ్దుల్ కలాం వర్ధంతిని నిర్వహించారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎస్. నాగస్వామి నాయక్ ఆధ్వర్యంలో డాక్టర్ కలాం చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.

ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ డాక్టర్ ఎస్. నాగస్వామి నాయక్ మాట్లాడుతూ, డాక్టర్ అబ్దుల్ కలాం యువతకు స్ఫూర్తిప్రదాత అని, ఆయన కలలు కన్న అభివృద్ధి చెందిన భారతదేశ నిర్మాణంలో విద్యార్థులు తమ వంతు పాత్ర పోషించాలని సూచించారు. క్రమశిక్షణ, అంకితభావం, విజ్ఞాన సంపాదనతో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని పిలుపునిచ్చారు.

అధ్యాపకులు మాట్లాడుతూ, డాక్టర్ అబ్దుల్ కలాం జీవితం ప్రతి విద్యార్థికి ఆదర్శమని పేర్కొన్నారు. సాధారణ కుటుంబంలో జన్మించి దేశ అత్యున్నత పదవిని అధిరోహించిన ఆయన జీవితం కష్టపడే ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాయకమని అన్నారు. విద్యార్థులు ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకొని నిరంతరం శ్రమిస్తూ, శాస్త్రీయ దృక్పథంతో ముందుకు సాగాలని సూచించారు. దేశాభివృద్ధికి యువత కీలక శక్తిగా నిలవాలని, కలాం ఆశయాలను ప్రతి ఒక్కరూ ఆచరణలో పెట్టాలని పిలుపునిచ్చారు.

అనంతరం కళాశాల అధ్యాపకులు, సిబ్బంది కలిసి డాక్టర్ అబ్దుల్ కలాం చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.

ఈ కార్యక్రమంలో ప్రసన్న కుమార్, మల్లికార్జున, విజయశేఖర్, రామకృష్ణ, సోమేష్, ఉల్గోజి రావు, శారధి పటేల్, శ్రీధర్ మూర్తి, బాల శంకర్ తదితర అధ్యాపకులు మరియు సిబ్బంది పాల్గొన్నారు.

V RAMAMOHAN, KURNOOL

V RAMAMOHAN, KURNOOL

Next Story