Markapuram: మార్కాపురంలో చెట్టును ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు.. సురక్షితంగా ప్రయాణికులు!

Markapuram: మార్కాపురం జిల్లా పెద్దారవీడు మండలం రాజంపల్లి–చట్లమిట్ట వద్ద ఏపీఎస్ఆర్టీసీ బస్సు ప్రమాదానికి గురైంది.

Srikanth Singam, Markapur
Published on: 22 Jun 2026 7:19 AM IST
Markapuram
X

Markapuram: మార్కాపురంలో చెట్టును ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు.. సురక్షితంగా ప్రయాణికులు!

మార్కాపురం జిల్లా: పెద్దారవీడు మండలంలోని రాజంపల్లి–చట్లమిట్ట గ్రామాల మధ్య సోమవారం వేకువజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఏపీఎస్ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్సు అదుపుతప్పి చెట్టును ఢీకొట్టింది. నూజివీడు నుంచి శ్రీశైలం వెళ్తున్న బస్సు మార్గమధ్యంలో రోడ్డుపై ఉన్న చనిపోయిన గేదెను ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది.

డ్రైవర్ చాకచక్యంగా వ్యవహరించడంతో బస్సులోని ప్రయాణికులు ఎలాంటి గాయాలు లేకుండా బయటపడ్డారు. అయితే డ్రైవర్ స్టీరింగ్ వద్ద ఇరుక్కుపోయాడు. సమాచారం అందుకున్న 108 అంబులెన్స్ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని సుమారు 15 నుంచి 20 నిమిషాల పాటు శ్రమించి డ్రైవర్‌ను బయటకు తీసి ప్రథమ చికిత్స అందించారు. అనంతరం అతడిని మార్కాపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

క్షతగాత్రులను 108 సిబ్బంది నక్కా శీను, ప్రదీప్ చంద్ర, శివ, శ్యాంబాబు, రాజేంద్ర, చెన్నకేశవులు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు వారి సేవలను ప్రయాణికులు, పెద్దారవీడు ఎస్సై అభినందించారు.

Srikanth Singam, Markapur

Srikanth Singam, Markapur

Next Story