Banaganapalle: ఆర్టీసీ సిబ్బందికి జూన్ 1 నుండి హెల్త్ చెకప్స్

Banaganapalle: త్వరలోనే ఏపీఎస్‌ఆర్‌టీసీలో ఎలక్ట్రిక్ బస్సులు ప్రవేశపెడతామని ఈడీ రాఘవకుమార్ తెలిపారు.

Ramanaiah, Banaganepalle
Published on: 20 May 2026 3:55 PM IST
Banaganapalle
X

Banaganapalle: ఆర్టీసీ సిబ్బందికి జూన్ 1 నుండి హెల్త్ చెకప్స్

బనగానపల్లె: ఆర్టిసి బస్టాండ్ ను తనిఖీ చేసిన ఏపీ ఎస్ఆర్ టి సి జోన్ 4 రాఘవకుమార్. త్వరలో ఏపీఎస్ఆర్టీసీకి ఎలక్ట్రికల్ బస్సులు తీసుకురానున్నట్లు ఆ సంస్థ ఈడి రాఘవ్ కుమార్ తెలిపారు. బస్టాండ్ ఆవరణము పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. కడప జోన్ లో లో 51 ఆర్టీసీ డిపోలు ఉన్నాయన్నారు ఈ డిపోల ద్వారా ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు.

సిబ్బంది ప్రయాణికుల పట్ల మర్యాదగా నడు చుకోవాలని సూచించారు. కడప జోన్ లో 3900 బస్సులు ఉండగా అందులో 2800 బస్సులు శ్రీ శక్తి పథకానికి వినియోగిస్తున్నామని తెలిపారు. ఆర్టీసీ స్టాప్ అనారోగ్య దృశ్య వచ్చేనెల 1వ తేదీ నుంచి 40 సంవత్సరాలు దాటిన ప్రతి ఎంప్లాయ్ కి హెల్త్ చెకప్ చేయించుకోవాలని ఈడి రాఘవ కుమార్ అన్నారు.

ప్రతి శుక్రవారం హెల్త్ ఆఫీసర్ డిపో వద్దకు వచ్చి ఆరోగ్య సమస్యల మీద అవగాహన చేసి బీపీ షుగర్ వల్ల వచ్చే అనారోగ్య సమస్యల గురించి అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేస్తామని ఈడీ రాఘవ కుమార్ తెలిపారు. కార్యక్రమంలో బనగానపల్లె డిపో మేనేజర్ శశి భూషణ్ రీజినల్ మేనేజర్ రజియా సుల్తానా వెంకటన్న తదితరులు పాల్గొన్నారు.

Ramanaiah, Banaganepalle

Ramanaiah, Banaganepalle

Next Story