Emmiganur: ఎమ్మిగనూరులో మంగళవారం ఏపీడబ్ల్యూజేఎఫ్ తాలూకా మహాసభలు!
Emmiganur: కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో మంగళవారం జరగనున్న ఏపీడబ్ల్యూజేఎఫ్ తాలూకా రెండవ మహాసభలను జర్నలిస్టులు విజయవంతం చేయాలని తాలూకా కమిటీ పిలుపునిచ్చింది.
Emmiganur: ఎమ్మిగనూరులో మంగళవారం ఏపీడబ్ల్యూజేఎఫ్ తాలూకా మహాసభలు!
Emmiganur: కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు పట్టణంలోని కుర్ని కల్యాణ మండపంలో మంగళవారం జరుగునున్న తాలూకా రెండవ మహాసభలను పాత్రికేయ మిత్రులు హాజరై విజయవంతం చేయాలని తాలూకా అధ్యక్షులు యస్.కె. షబ్బీర్, తాలూకా కమిటీ సభ్యులు పిలుపునిచ్చారు.
ఈ సందర్బంగా పాత్రికేయ సమావేశంలో తాలూకా కమిటీ సభ్యులతో కలసి ఆయన మాట్లాడుతూ జిల్లా కమిటీ సభ్యులు ఈ నెల 19వ తారీఖున జిల్లా మహాసభలను విజయవంతంగా నిర్వహించారని అందులో భాగంగా ఎమ్మిగనూరు తాలూకా కమిటీ రెండవా మహాసభలను రేపు ( 29వ తేదీన మంగళవారం ) పట్టణంలోy ఘనంగా నిర్వహిస్తున్నామని అన్నారు. ఈ సమావేశానికి ముఖ్య అతిధులుగా జిల్లా కమిటీ సభ్యులు హాజరవుతున్నారని కావున ప్రతి ఒక్క పాత్రికేయ మిత్రుడు తప్పకుండా హాజరై తాలూకా మహాసభలను విజయవంతం చేయాలని కోరారు.ఈ సమావేశంలో తాలూకా కమిటీ సభ్యులు,నందవరం,గోనెగండ్ల కమిటీ సభ్యులు పాల్గొన్నారు.




