Atmakur: నల్లమలలో విజయనగర కాలం నాటి విశేషాలు

Atmakur: ఎగువ అహోబిలం ఆలయంలో పురావస్తు శాఖ జరిపిన పరిశోధనల్లో 1553 నాటి రాతి శాసనం బయటపడింది.

M Satya Peter, Atmakur (Karnool)
Published on: 12 May 2026 8:23 PM IST
Atmakur
X

Atmakur: నల్లమలలో విజయనగర కాలం నాటి విశేషాలు

Atmakur: నల్లమల అంటేనే.. శైవ క్షేత్రాల సమహారం. అలాంటి నల్లమలలో వైష్ణవ చరిత్రలోనే ప్రసిద్ధ క్షేత్రంగా చెప్పుకునే అహోబిలం ఎగువ ఆలయంలో పురావస్తు శాఖ పరిశీలనలో రాత్రి పై చెప్పిన కొన్ని శాసనాలను భారత పురావస్తు శాఖ కనుగొంది. ఈ శాసనంలో అసలు విషయం ఏంటంటే.. ఆత్మకూరు నల్లమలలో ఒకనాటి ఉపశక్తి పీఠంగా నిర్మించిన కొరుకుంద గ్రామ ప్రస్తావన శాసనంలో ఉంది. ఈ గ్రామం ఒకనాటి అగ్రహారం. అష్టాదశ శక్తి పీఠాల్లో ఒకటైన శ్రీశైల భ్రమరాంబ దేవి మరో రూపం కురుకుల్లాంభ పేరుతో ఇక్కడ వెలసిందని ఇతిహాస నేపథ్యం.

కాలక్రమేనా కురుకుంద పేరుతో ఈ గ్రామాన్ని పిలుస్తున్నారు. ఎగువ అహోబిలం ఆలయం ప్రధాన ద్వారం కుడివైపు రాతి గోడపై కన్నడ లిపిలో చెక్కిన శాసనాన్ని పురావస్తు శాఖ పరిశోధించింది. ఆత్మకూరు సమీప ఉరుకుంద గ్రామానికి చెందిన దలవాయి లింగరస, గురజాల నరస నాయన కుమారుడు పోచి రాజా నరసరాజయ మహా అరసు యొక్క పుణ్యం కోసం ఈ శాసనాన్ని శాలివాహన శకం 1475 వరదావీ నామ సంవత్సరం, ఆషాడ బహుళ 11 ఈ తేదీ సామాన్య శకం విజయనగర రాజు సదాశివరాయల కాలంలో..1553 జులై 2 తేదీన శనివారం శాసనంగా రాఖిపై చెక్కించారు.

అహోబిల నరసింహుడికి రోజువారి సహస్రనామ రథం చేసేందుకు ఇందుకుగాను 12 బంగారు వరహాలు ఇచ్చినట్లు శాసనంలో స్పష్టంగా చెప్పబడింది. కురుకుంద గ్రామానికి సమీపంలో వరదరాజ స్వామి, లింగమయ్య ప్రాంతాల్లో కూడా పలు రాతి శాసనాలు ఇప్పటికీ ఉన్నాయి. గతంలో గుప్త మహేశ్వరంగా పిలవబడి, ప్రస్తుతం పెద్దగుమ్మితంగా పిలుస్తున్న నల్లమల లోని ఆలయంలో ఉన్న శాసనాలు 700 సంవత్సరాల గడుస్తున్నా చెక్కుచెదరకుండా ఉండటం విశేషం. కేంద్ర, రాష్ట్ర పురావస్తు శాఖ పరిశోధకులు ఆత్మకూరు నల్లమలలోని ఆలయాల్లో ఉన్న రాతి శాసనాలను పరిశోధిస్తే వందల వేల సంవత్సరాల నాటి చారిత్రక విషయాలు వెలుగు చూసే అవకాశాలు ఉన్నాయి.

M Satya Peter, Atmakur (Karnool)

M Satya Peter, Atmakur (Karnool)

Next Story