Nandyal: పెట్రోల్ బంకుల షట్టర్లు బంద్.. ఆత్మకూరులో వాహనదారుల అవస్థలు!

Nandyal: నంద్యాల జిల్లా ఆత్మకూరులో పెట్రోల్, డీజిల్ కృత్రిమ కొరతతో వాహనదారులు, రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

M Satya Peter, Atmakur
Published on: 24 April 2026 10:03 AM IST
Nandyal
X

Nandyal: పెట్రోల్ బంకుల షట్టర్లు బంద్.. ఆత్మకూరులో వాహనదారుల అవస్థలు!

నంద్యాల జిల్లా: ఇరాన్ - ఇజ్రాయిల్ యుద్ధ సాకు చూపి డీజిల్ పెట్రోలు కొరత ఏర్పడిందని చమురు నిల్వలు అందుబాటులో లేవంటూ నంద్యాల జిల్లా ఆత్మకూరు డివిజన్లో పెట్రోల్ బంకు యజమానులు కృత్రిమ కొరత సృష్టించారు. పూర్తిగా నల్లమల అటవీ ప్రాంతం కావడం వినియోగదారులను తీవ్ర ఇబ్బందుల పాలు చేసింది. మరోవైపు పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గిస్తామని కేంద్రం చెప్పిందని సోషల్ మీడియాలో వైరల్ కావడంతో తమరు వ్యాపారులు స్టాక్ లేదని కృత్రిమ కొరత సృష్టించారు. దీంతో ఆత్మకూరు డివిజన్ లో 40 కి పైగా పెట్రోల్ పంపు లను యజమానులు మూసివేశారు. రైతులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందుల పాలయ్యారు.

తెల్లారితే పెట్రోల్ డీజిల్ నిలువలు పూర్తిగా తగ్గిపోయి పెట్రోల్ బంకులు అన్నింటిని మూసివేస్తారని సోషల్ మీడియాలో వైరలైంది. దీంతో కంగారు పడ్డ నంద్యాల జిల్లా ఆత్మకూరు డివిజన్లో వినియోగదారులు పెట్రోల్ బంకుల వద్దకు పరుగులు తీశారు. అప్పటికే 90% పెట్రోల్ బంకుల్లో స్టాక్ లేదని మూసేశారు. ఆత్మకూరు కేంద్రంగా అమరావతి, శ్రీశైలం, మహానంది, తిరుపతి, కర్నూలు, బెంగళూరు వైపు వెళ్లే వాహనాలకు పెట్రోల్ డీజిల్ లేక ఆత్మకూరులో నిలిచిపోయాయి.

నందికొట్కూరులో ఏకంగా అన్ని పెట్రోల్ బంకులను మూసివేశారు. వెలుగోడు, ఆత్మకూరు, కొత్తపల్లి, పాములపాడు, బండి ఆత్మకూరు, జూపాడుబంగ్లా మండలాల్లో పెట్రోల్ లేక వినియోగదారులు ఆత్మకూరు చేరుకుంటే ఉన్న ఏడు పెట్రోల్ పంపులు ఒకటి మాత్రమే అరకొరగా పని చేసింది.

కేంద్రం పెట్రోలు డీజిల్ ధరలను తగ్గించవచ్చనే సందేహంతో డీలర్లు అందరూ కుమ్మక్కై కృత్రిమ కొరత సృష్టించారని వినియోగదారులు ఆరోపిస్తున్నారు. రాత్రికి రాత్రే 24 గంటల్లో వీలైనంత ఎక్కువ చమురును అమ్ముకోవాలని అవుట్లెట్లు స్టాక్ లేదని పెట్రోల్ పంపులు మూసి వేశారు. దీంతో కర్నూలు - అమరావతి 340 సి జాతీయ రహదారి పై ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. హైవేపై వాహనాలు నిలిచిపోయాయి.

ఈ వేసవిలో వరి కోతలు మొదలయ్యాయి. వేల హెక్టార్లలో వరి పంటను కోసే యంత్రాలకు డీజిల్ లేక నిలిచిపోయాయి. వాహనాలకు రూ. 200 ఒక మించి పెట్రోలు పోయడం లేదు. పెట్రోల్ బంకు యజమానుల నిర్వాకం, ప్రకృతి మా కొరత కారణంగా రైతులు ఇబ్బందులు పడుతున్నారు. అకాల వర్షాలు వస్తే చేతికొచ్చిన పంట నీటి పాలు కాక తప్పదని రైతులు ఆందోళన చెందుతున్నారు. నంద్యాల జిల్లా కలెక్టర్ తమరు నిల్వల కొరతలేదని, కృత్రిమ కొరత సృష్టిస్తే యజమానులపై చర్యలు తప్పవని హెచ్చరించారు. కానీ జిల్లా కలెక్టర్ దేశాలను ధిక్కరించి పెట్రోలు బంకు యజమానులు ఇష్టానుసారంగా వ్యవహరించి రైతులను, వాహనదారులను ఇబ్బందుల పాలు చేస్తున్నా సంబంధిత అధికారులు మాత్రం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు.

M Satya Peter, Atmakur

M Satya Peter, Atmakur

Next Story