Banaganapalle: ఆర్యవైశ్యుల సేవలు సమాజ అభివృద్ధిలో ఎంతో కీలకం!

Banaganapalle: నంద్యాల జిల్లా బనగానపల్లెలో కోవెలకుంట్ల ఆర్యవైశ్య సంఘం నూతన అధ్యక్షుడు కాలువ నాగేశ్వరరావును అభినందించిన రాష్ట్ర మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి.

Ramanaiah, Banaganepalle
Published on: 7 Nov 2026 10:59 AM IST
Banaganapalle
X

Banaganapalle: ఆర్యవైశ్యుల సేవలు సమాజ అభివృద్ధిలో ఎంతో కీలకం!

Banaganapalle: ఆర్యవైశ్యులు వ్యాపార, వాణిజ్య రంగాల్లోనే కాకుండా సామాజిక సేవ, విద్య, వైద్యం, ధార్మిక కార్యక్రమాల్లోనూ విశేషమైన పాత్ర పోషిస్తున్నారని రాష్ట్ర మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి పేర్కొన్నారు.

సమాజంలో ఐక్యత, సేవాభావం, దాతృత్వానికి ఆర్యవైశ్యులు ప్రతీకగా నిలుస్తున్నారని, సమాజ అభ్యున్నతికి వారు అందిస్తున్న సేవలు అభినందనీయమని అన్నారు.

బనగానపల్లె క్యాంపు కార్యాలయంలో కోయిలకుంట్ల పట్టణంలోని ఆర్యవైశ్య సంఘం అమ్మవారి శాల నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన కాలువ నాగేశ్వరరావు మర్యాదపూర్వకంగా మంత్రిని కలిశారు. ఈ సందర్భంగా నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన కాలువ నాగేశ్వరరావును మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి అభినందించి, శుభాకాంక్షలు తెలియజేశారు.

నూతన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తూ సంఘ అభివృద్ధికి, ఆర్యవైశ్యుల ఐక్యతకు కృషి చేయాలని ఆకాంక్షించారు. సమాజ సేవా కార్యక్రమాల్లో ఆర్యవైశ్య సంఘం మరింత చురుకైన పాత్ర పోషించాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో జిల్లా ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు టంగుటూరు సీనయ్య ఆధ్వర్యంలో సుమారు 100 మంది ఆర్యవైశ్య మహిళలు, పురుషులు, సంఘ ప్రముఖులు పాల్గొన్నారు.

Ramanaiah, Banaganepalle

Ramanaiah, Banaganepalle