Kurnool: రూ.30 లక్షలు, రెండు ప్లాట్లు ఇవ్వాలంటూ ట్రాక్టర్లతో వెంచర్ ధ్వంసం

Kurnool: కర్నూలు జిల్లా ఆస్పరి మండలం బిల్లేకల్‌లో టీడీపీ నేత, మార్కెట్ యార్డ్ చైర్మన్ బిల్లెకల్ వెంకటేష్ దౌర్జన్యానికి పాల్పడ్డారు.

Bheemalinga, Aluru
Published on: 19 July 2026 9:46 PM IST
Kurnool
X

Kurnool: రూ.30 లక్షలు, రెండు ప్లాట్లు ఇవ్వాలంటూ ట్రాక్టర్లతో వెంచర్ ధ్వంసం

కర్నూలు: కర్నూలు జిల్లా ఆస్పరి మండలం బిల్లేకల్ లో రెచ్చి పోతున్న టీడీపీ నాయకులు ఆగడాలు.రియల్ ఎస్టేట్ వ్యాపారి తమకు 30 లక్షలు రూపాయలు మరియు రెండు ప్లాట్లు ఇవ్వాలంటూ బోయ లక్ష్మన్న పై బెదిరింపులకు పాల్పడిన టిడిపి నాయకుడు మార్కెట్ యార్డ్ చైర్మన్ బిలేకళ్ళు వెంకటేష్.

మా గ్రామంలో వెంచర్ వేసినందుకు 30 లక్షలు నగదు తో పాటు రెండు ప్లాట్లు ఇవ్వాలంటూ హుకుం జారీ చేశారు.వెంచర్ యాజమానులు డబ్బులు ఇవ్వనందుకు వెంచర్ ను ట్రాక్టర్ తో దున్నేపించిన టీడీపీ నాయకులు బిల్లెకల్ వెంకటేష్.

వెంచర్ వేసినందుకు ఇప్పటికే టీడీపీ ఇంచార్జి వైకుంఠం జ్యోతి కి రెండు లక్షల డబ్బులు ఇవ్వమని తెలిపిన వెంచర్ యజమానులు ఇప్పుడేమో నాకు 30 లక్షలు డబ్బు, రెండు ప్లాటు ఇవ్వాలంటూ మార్కెట్ యార్డ్ చైర్మన్ బిల్లెకల్ వెంకటేష్ డిమాండ్ చేసాడు ,అతని చెప్పిన విధంగా చెయ్యనందుకు వెంచర్ ను పూర్తిగా నాశనం చేసాడని వాపోయిన భాదితులు.అసలే వ్యాపరం లేక ఇబ్బంది పడుతుంటే ఇలా అడిగిన వారికంతా డబ్బులు ఇస్తే తాము రోడ్డున పడాలని వాపోతున్నరు బాధితుడు లక్ష్మణ.

Bheemalinga, Aluru

Bheemalinga, Aluru

Next Story