Atmakur: పది ఫలితాల వేళ.. పిల్లల వెంటే ఉండండి: తల్లిదండ్రులకు ఆత్మకూరు సిఐ గంగాధర్ హితవు!

Atmakur: నేడు 10వ తరగతి ఫలితాలు రానున్న నేపథ్యంలో ఆత్మకూరు సిఐ గంగాధర్ తల్లిదండ్రులకు కీలక సూచనలు చేశారు. ఫలితాలు ఎలా వచ్చినా పిల్లలకు ధైర్యం చెప్పాలని, వారిని మందలించవద్దని కోరారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 30 April 2026 9:44 AM IST
Atmakur
X

Atmakur: పది ఫలితాల వేళ.. పిల్లల వెంటే ఉండండి: తల్లిదండ్రులకు ఆత్మకూరు సిఐ గంగాధర్ హితవు!

ఆత్మకూరు: ఈరోజు 10వ తరగతి పరీక్షల ఫలితాలు రానున్న నేపథ్యంలో పదవ తరగతి పరీక్షలు రాసిన విద్యార్థుల వెంట ఉండేందుకు వారి తల్లిదండ్రులు సమయం కేటాయించాలని ఆత్మకూరు సిఐ గంగాధర్ తెలిపారు. ఫలితాలు ఏ విధంగా వచ్చిన దాని ప్రభావం చిన్నారులపై ఉండే అవకాశం ఉన్నందున వారిని గమనిస్తూ ఫెయిల్ అయ్యామని లేదా తక్కువ మార్కులు వచ్చాయని బాధపడే విద్యార్థులకు ధైర్యం చెప్పాలని తెలిపారు.

ఫలితాలు ఏ విధంగా వచ్చిన పిల్లలకు తల్లిదండ్రులు మనోధైర్యంతో ముందుకెళ్ళు.. వచ్చే సంవత్సరం ఇంకా బాగా ప్రయత్నించు ఇలా మంచి మాటలు చెప్పి పిల్లలను ప్రోత్సహించాలి తప్ప.. మగలించకూడదని తల్లిదండ్రులకు హితవు పలికాడు మనోధైర్యంతో ముందుకెళ్లాలని విద్యార్థులకు సిఐ గంగాధర్ సూచించారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story