Atmakur: ఆత్మకూరు మున్సిపల్ ఛైర్మన్ బరిలో వైఎస్సార్‌సీపీ

Atmakur: ఆత్మకూరు మున్సిపల్ ఛైర్మన్ స్థానానికి వైఎస్సార్‌సీపీ నుంచి డాక్టర్ ప్రియాంక భాయ్ నామినేషన్ సమర్పించారు. శిల్పా భువనేశ్వర్ రెడ్డి హాజరయ్యారు.

M Satya Peter, Atmakur (Karnool)
Published on: 16 Oct 2026 5:02 PM IST
Atmakur
X

Atmakur: ఆత్మకూరు మున్సిపల్ ఛైర్మన్ బరిలో వైఎస్సార్‌సీపీ

ఆత్మకూరు: స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ ప్రక్రియ మొదలు కావడంతో నంద్యాల జిల్లా ఆత్మకూరు మున్సిపాలిటీ చైర్మన్ స్థానానికి వైఎస్ఆర్సిపి నుంచి నామినేషన్ దాఖలయింది.

ఆ పార్టీ నుంచి డాక్టర్. ప్రియాంక భాయ్ తన నామినేషన్ను ఎన్నికల రిటర్నింగ్ అధికారికి వైఎస్ఆర్సిపి శ్రీశైలం సమన్వయకర్త శిల్ప భువనేశ్వర్ రెడ్డి, ఇద్దరు న్యాయవాదులతో కార్యాలానికి వచ్చి రిటర్నింగ్ అధికారికి అందజేశారు. దీంతో మొదటిరోజు నామినేషన్ల ప్రారంభంలో చైర్మన్ ఒకే ఒక అభ్యర్థి నామినేషన్ దాఖలు చేశారు.

యువత రాజకీయాల్లోకి వచ్చి పౌర సమాజాన్ని అభివృద్ధి వైపు నడిపించాలనే వైఎస్ఆర్సిపి అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి స్ఫూర్తితో తాను ఆత్మకూరు మున్సిపల్ చైర్మన్ పోటీ చేస్తున్నారని అభ్యర్థి ప్రియాంక భాయ్ అన్నారు.

ఆత్మకూరు మున్సిపాలిటీలో ప్రజారోగ్యం, పారిశుద్ధ్యం, స్వచ్ఛమైన తాగునీరు, యువతకు ఉపాధి అనే అంశాలే లక్ష్యంగా ఎన్నికల ప్రచారం చేపడతానని అన్నారు.

M Satya Peter, Atmakur (Karnool)

M Satya Peter, Atmakur (Karnool)