Atmakur: అటవీ శాఖలో విషాదం.. సాహసవంతుడైన అధికారి అనిల్ కన్నుమూత!
Atmakur: ఆత్మకూరు వన్యప్రాణి అటవీ డివిజన్ ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ మరియు ఏపీ జూనియర్ ఫారెస్టర్స్ అసోసియేషన్ అధ్యక్షులు అనిల్ అనారోగ్యంతో కన్నుమూశారు.
Atmakur: అటవీ శాఖలో విషాదం.. సాహసవంతుడైన అధికారి అనిల్ కన్నుమూత!
ఆత్మకూరు: ఆత్మకూరు వన్యప్రాణి అటవీ డివిజన్లో ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్, ఆంధ్రప్రదేశ్ జూనియర్ ఫారెస్టర్స్ అసోసియేషన్ అధ్యక్షులు అనిల్ మృతి చెందారు . అనారోగ్యంతో కర్నూలు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం కోలుకోలేక తుది శ్వాస విడిచారు. నిబద్ధత, నిజాయితీ అధికారిగా అటవీ శాఖలో మంచి పేరు సంపాదించుకున్న ఎఫ్ ఎస్ ఓ అనిల్ పెద్దపులను సంరక్షణ అభయారణ్యంలో ప్రాణాలకు తెగించి కీలక విధులు నిర్వహించి వేటగాళ్లను కట్టడి చేసిన సంఘటనలో అనిల్ కు సాహసవంతమైన అధికారిక పేరుంది. అనిల్ మృతి అటవీశాఖకు తీరనిలోటని అటవీ సిబ్బంది విచారం వ్యక్తం చేసింది . అనిల్ మృతదేహానికి ఆత్మకూరు అటవీ డిప్యూటీ డైరెక్టర్ విగ్నేష్ అప్పావ్, ఏపీ జూనియర్ ఫాస్టర్ అసోసియేషన్, సిబ్బంది అనిల్ పార్తివదేహానికి నివాళులర్పించి, అనిల్ కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేసింది.




