Atmakur: మొక్కజొన్న రైతుకు తప్పని కన్నీళ్లు.. మద్దతు ధర ఎండమావేనా?

Atmakur: నంద్యాల జిల్లా ఆత్మకూరు డివిజన్ లో మొక్కజొన్న రైతుల దీనస్థితి.

M Satya Peter, Atmakur
Published on: 5 May 2026 1:45 PM IST
Atmakur
X

Atmakur: మొక్కజొన్న రైతుకు తప్పని కన్నీళ్లు.. మద్దతు ధర ఎండమావేనా?

ఆత్మకూరు: మొక్కజొన్న సాగు రైతులకు కన్నీటి దిగుబడులే మిగిల్చి చివరకు మార్కెట్లో కనీస మద్దతు ధర కూడా లభించక తీవ్రంగా నష్టపోయారు. మూడుసార్లు ప్రకృతి మరదల రూపంలో విలయతాండం చేసినా కోలుకొని మొక్కజొన్న సాగు చేస్తే నష్టాన్ని ఆదుకోవాల్సిన ప్రభుత్వం మద్దతు ధర ప్రకటించినా కొనుగోలు మాత్రం లేదు. ఈరోజుకు మొక్కజొన్న పంటను వస్తూనే ఉన్నారు. ఇరాన్- ఇజ్రాయిల్ యుద్ధం కారణాన్ని చూపి చమురు నిల్వలను డీజిల్ సరఫరా సంస్థలు నిలిపివేయడం మొక్కజొన్న రైతుకు మరో భారీ నష్టం.

ఆత్మకూరు డివిజన్లో శ్రీశైలం, నందికొట్కూరు నియోజకవర్గాల్లో 11, 035 పెట్టాలని విస్తీర్ణంలో సాధారణ సాగుకు మించి మొక్కజొన్న పండించారు. కోత, నూర్పిడి పూర్తయి బస్తాల్లో నింపి కళ్ళల్లో సిద్ధంగా ఉంచారు. కానీ ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడంలో నిర్లక్ష్యం కారణంగా కనీస మద్దతు ధర క్వింటాలుకు రూ. 2,400 లభించడం లేదు. కేవలం రూ. 1700 లకే రైతుల అమ్ముకుంటున్నారు. ఈ ధరకు విక్రయిస్తే కనీస పెట్టుబడులు కూడా పావని రైతులు వాపోతున్నారు. నంద్యాల జిల్లాలోని ఏడు నియోజకవర్గాల్లో ఈసారి సాధారణ విస్తీర్ణానికి మించి 29, 524 హెక్టాలలో మొక్కజొన్న సాగు చేశారు.

ఈనెల చివరలో తిరిగి వ్యవసాయ సీజన్ ప్రారంభం కాక మనకే మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని నిలిచిపోయిన ధాన్యాన్ని అమ్ముకుంటేనే రాబోయే వ్యవసాయానికి రైతుకు పెట్టుబడి వస్తుందని లేకుంటే నిండా మునిగిన మొక్కజొన్న రైతులు ఈ ఏడాది పొలాలను బీడు భూములుగా చూసుకోవాల్సిందేనని రైతులు కాబోతున్నారు.

M Satya Peter, Atmakur

M Satya Peter, Atmakur

Next Story