Atmakur: వేధింపులు తాళలేక మెప్మా ఆర్‌పీ ఆత్మహత్యాయత్నం

Atmakur: నంద్యాల జిల్లా ఆత్మకూరులో మెప్మా ఆర్‌పీ లలితమ్మ వేధింపులు తాళలేక విషం తాగి ఆత్మహత్యాయత్నం. పరిస్థితి విషమించడంతో కర్నూలు ఆసుపత్రికి తరలింపు.

M Satya Peter, Atmakur (Karnool)
Published on: 30 July 2026 4:05 PM IST
Atmakur
X

Atmakur: వేధింపులు తాళలేక మెప్మా ఆర్‌పీ ఆత్మహత్యాయత్నం

ఆత్మకూరు: కూటమి ప్రభుత్వ నేతల ఆగడాలు.. దౌర్జన్యాలు మితిమీరడంతో మెప్మా పొదుపు సంస్థలో రిసోర్స్ పర్సన్ గా పనిచేస్తున్న లలితమ్మ అనే ఉద్యోగి వేధింపులకు తాళలేక విష ద్రావణం తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడి ప్రాణాలతో కొట్టుమిట్టాడుతుంది. తెలుగుదేశం పార్టీ నాయకులు ఆత్మకూరు మున్సిపాలిటీ మెప్మా టౌన్ మిషన్ మేనేజర్ వేధింపుల నుంచి రక్షించండి అంటూ బాధితులు మొరపెట్టుకుంటున్నారు.

నంద్యాల జిల్లా శ్రీశైలం నియోజకవర్గం పాలన కేంద్రం ఆత్మకూరు మున్సిపాలిటీ మెప్మా పొదుపు శాఖలో 12 సంవత్సరాలుగా పనిచేస్తున్న మహిళా రిసోర్స్ పర్సన్ లను ఆ శాఖ టౌన్ మిషన్ మేనేజర్ వెంకటేశ్వర్లు, సమీనా కొంతకాలంగా వేధిస్తున్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక ఆత్మకూరు టౌన్ టిడిపి నాయకులు మెప్మాలో ఓపెన్ మహిళా ఆర్పీలను తొలగించే కుట్రలో వేధింపులకు పాల్పడ్డారు. మెప్మా పొదుపు రుణాల మంజూరులో తమకు అనుకూలంగా లేరనే అభయవంతో విధుల నుంచి వైదొలగాలని వేధింపులకు పాల్పడుతున్నారు.

ఈ క్రమంలో ఆత్మకూరు మున్సిపాలిటీలో మెప్మా రిసోర్స్ పర్సన్ లలితమ్మను మేనేజర్ వెంకటేశ్వర్లు, సమీనా వీరిద్దరూ బెదిరించి వేధిస్తున్నారు. 12 సంవత్సరాలుగా నిజాయితీగా పనిచేస్తున తమను రాజీనామా చేసి వెళ్ళిపోవాలని లేకుంటే అక్రమ కేసులు బనాయించి జైలుకు పంపిస్తామని వేధించడం వల్లే తన కూతురు లలితమ్మ విష ద్రావణం తాగి ఆత్మహత్యయత్నానికి పాల్పడిందని బాధితురాలి తల్లి రమణమ్మ మీడియా ఎదుట వాపోయింది.

కూటమి నాయకుల ఒత్తిడి వల్ల జూమ్ మీటింగ్లో దుర్భాషలాడి వేధించి అవమానించినందుకు తట్టుకోలేకనే ఆత్మహత్యకు తెగ పడాల్సి వచ్చిందని బాధితులు అన్నారు.

మెప్మా కార్యాలయంలో జరగాల్సిన పొదుపు సమావేశాలు తెలుగుదేశం నాయకుల ఇళ్లలో మేనేజర్ వెంకటేశ్వర్లు నిర్వహించి తమను రాజీనామా చేసి వెళ్లిపోవాలని దుర్భాషలాడుతున్నాడని మీరు వేధింపుల నుంచి రక్షణ కల్పించాలంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును బాధ్యతలు మొరపెట్టుకుంటున్నారు. స్థానిక మెప్మా అర్పిలకు ప్రాణహాని ఉందని వారిపై చర్యలు తీసుకోవాలని బాధిత ఆర్పీలు అంటున్నారు.

విషాదరావణం తాగి ఆత్మహత్యకు పాల్పడిన మెప్మా ఆర్ పి లలితమ్మ ను ఆత్మకూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి సూపరిండెంట్ డాక్టర్ రాయుడు సిఫార్సు చేశారు.

M Satya Peter, Atmakur (Karnool)

M Satya Peter, Atmakur (Karnool)

Next Story