Atmakur: ఆత్మకూరు మున్సిపల్ చైర్మన్ అభ్యర్థిగా డా. గోవిందరాజులు

Atmakur: నంద్యాల జిల్లా ఆత్మకూరు మున్సిపల్ చైర్మన్ టీడీపీ అభ్యర్థిగా డాక్టర్ గోవిందరాజులు ఖరారయ్యారు. ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి సమక్షంలో నామినేషన్ దాఖలు చేశారు.

M Satya Peter, Atmakur (Karnool)
Published on: 17 Oct 2026 7:19 PM IST
Atmakur
X

Atmakur: ఆత్మకూరు మున్సిపల్ చైర్మన్ అభ్యర్థిగా డా. గోవిందరాజులు

Atmakur: ఎట్టకేలకు ఆత్మకూరు మునిసిపల్ చైర్మన్ పీఠానికి అభ్యర్థిని తెలుగుదేశం పార్టీ ఖరారు చేసింది. ఆ వెంటనే నామినేషన్ వేసేందుకు రంగం సిద్ధం చేసింది. గత ఐదు రోజులుగా అద్దర్తి ఖరారు విషయంలో తర్జనభర్జనలు, గందరగోళానికి లోనైన శ్రీశైలం బుడ్డా రాజశేఖర్ రెడ్డి చివరిగా డాక్టర్ గోవింద రాజులను చైర్మన్ అభ్యర్థిగా రంగంలోకి దించి నామినేషన్ దాఖలు చేయించారు.

నంద్యాల జిల్లా ఆత్మకూరు మున్సిపాలిటీ స్థానిక సంస్థల ఎన్నికల్లో చైర్మన్ పీఠానికి టిడిపి ఎంపిక చేసిన డాక్టర్. గోవిందరాజులు ఆ పార్టీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. మూడు సెట్ల నామినేషన్ పత్రాలను ఎన్నికల రిటర్నింగ్ అధికారికి అందజేశారు.

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ అంజలి ఘటించి మీడియాతో మాట్లాడారు. డాక్టర్ బాబాసాహెబ్ హక్కుల వల్లనే తాను మున్సిపల్ ఎన్నికల్లో ఆత్మకూరు చైర్మన్ స్థానానికి నామినేషన్ దాఖలు చేశానన్నారు. ఆత్మకూరు మున్సిపాలిటీగా అభివృద్ధి చేసేందుకు, బడుగు బలహీన సామాజిక వర్గ ప్రజలు అధిక సంఖ్యలో ఉండటం, వారికి కనీస సౌకర్యాలు కూడా లేకపోవడం బాధాకరంగా ఉందన్నారు. కూటమి ప్రభుత్వంలో మున్సిపాలిటీని అభివృద్ధి చేసి, ఉపాధి అవకాశాలు కల్పిస్తానన్నారు. ఈ మున్సిపాలిటీ తనను గెలిపించాలని ఆయన కోరారు.

M Satya Peter, Atmakur (Karnool)

M Satya Peter, Atmakur (Karnool)