Atmakur: నంద్యాల జిల్లా బిజెపి కిసాన్ మోర్చా ఇన్చార్జిల నియామకం
Atmakur: నంద్యాల జిల్లా బిజెపి కిసాన్ మోర్చా మండల ఇన్చార్జిల నియామక పత్రాలు అందజేసిన బిజ్జం సుబ్బారెడ్డి. రాష్ట్రస్థాయిలో సభ్యత్వాల్లో రెండవ స్థానం.
Atmakur: నంద్యాల జిల్లా బిజెపి కిసాన్ మోర్చా ఇన్చార్జిల నియామకం
ఆత్మకూరు: ఏపీ రాష్ట్ర బిజెపి కిసాన్ మోర్చా అధిష్టానం సూచన మేరకు నంద్యాల జిల్లా కిసాన్ మోర్చా అధ్యక్షులు బిజ్జం సుబ్బారెడ్డి జిల్లాలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల మండల కమిటీ ఇన్చార్జిలను ఏర్పాటు చేశారు. రాష్ట్రంలో బిజెపి కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో జిల్లా కమిటీలు, నియోజకవర్గ మండలాల్లో మోర్చా బలోపేతానికి కృషిచేసి సభ్యత్వాల నమోదులో రాష్ట్రంలో రెండవ స్థానంలో నిలిచిన నంద్యాల కిసాన్ మోర్చా అధ్యక్షుడు బిజ్జం సుబ్బారెడ్డిని రాష్ట్ర అధిష్టానం అభినందించింది.
కిసాన్ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి చిరంజీవి రెడ్డిని నంద్యాల అసెంబ్లీ ఇన్చార్జిగా నియమించారు. అలాగే జిల్లా ప్రధాన కార్యదర్శి వి.వి సాయిదత్ ను ఆత్మకూరు, పాములపాడు, కొత్తపల్లి మండల ఇన్చార్జిగా, వీటితోపాటు మరో 6 మంది ని జిల్లాలోని ఆరు అసెంబ్లీ నియోజకవర్గాల మండల ఇన్చార్జిలుగా నియమిస్తూ రాష్ట్ర కిసాన్ మోర్చాశాఖ విడుదల చేసిన నియామక పత్రాలను జిల్లా అధ్యక్షులు బిజ్జం సుబ్బారెడ్డి ఇన్చార్జిలకు అందజేశారు.




