Atmakur: ఆత్మకూరులో రూ.42 లక్షల అనుమానిత నగదు సీజ్
Atmakur: నంద్యాల జిల్లా ఆత్మకూరు పెద్ద బజారు వీధిలోని రియల్టర్ ఇంట్లో ఓటర్లకు పంచేందుకు దాచిన రూ.42 లక్షల నగదును పోలీసులు సీజ్ చేసి ఐటీ శాఖకు అప్పగించారు.
Atmakur: ఆత్మకూరులో రూ.42 లక్షల అనుమానిత నగదు సీజ్
నంద్యాల జిల్లా: ఆత్మకూరు పెద్ద బజారు వీధిలోని ఇంట్లో దొరికిన 42 లక్షల రూపాయల అనుమానిత నగదు వివరాలను ఆత్మకూరు డి.ఎస్.పి రామాంజి నాయక్ మీడియాకు వెల్లడించారు.
పట్టణంలో రియల్ ఎస్టేట్ వ్యాపారి భీమిశెట్టి కృష్ణమూర్తి ఇంట్లో ఓటర్లకు పంచేందుకు రాజకీయ పార్టీ భారీ నగదును దాచిందనే సమాచారంతో తనిఖీ చేయగా ఈ నగదు దొరికిందన్నారు. ఎన్నికల ఫ్లయింగ్ స్క్వాడ్, మునిసిపల్ సిబ్బంది సమక్షంలో స్వాధీన పరుచుకొని పంచనామా చేశామని ఆత్మకూరు డిఎస్పి తెలిపారు.
అనుమానిత నగదుకు సంబంధించి సరైన వివరాలు, పత్రాలు లేనందున ఆ నగదును ఆదాయ పన్ను శాఖ అధికారులకు అప్పగించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు డి.ఎస్.పి వివరించారు.




