Atmakur: ఆత్మకూరు ముసలిమడుగులో గుప్త నిధుల వేట.. కలకలం
Atmakur: శ్రీశైలం ముంపు గ్రామం ముసలిమడుగులో బయటపడిన పురాతన బావి. గుప్త నిధుల కోసం అక్రమ తవ్వకాలు చేస్తున్న ముఠాలు. పురాతన కట్టడాలను కాపాడాలని స్థానికుల డిమాండ్.
Atmakur: ఆత్మకూరు ముసలిమడుగులో గుప్త నిధుల వేట.. కలకలం
ఆత్మకూరు: ఆధునిక దేవాలయం శ్రీశైలం బహుళార్థక సాధక ప్రాజెక్టు నిర్మాణం పూర్తయిన తర్వాత పూర్వపు ఆంధ్ర ప్రదేశ్ లో 126 గ్రామాలు నీటి ముంపునకు గురయ్యాయి. అందులో ఒక గ్రామానికి సుమారు 11 సంవత్సరాల చారిత్రక నేపథ్యం ఉంది. ఆ గ్రామమే నంద్యాల జిల్లా ఆత్మకూరు డివిజన్ కొత్తపల్లి మండలంలోని ముసలిమడుగు గ్రామం.
క్రీస్తుశకం 9. వ శతాబ్దంలో పల్లవ చక్రవర్తులు సప్త నది సంగమేశ్వర ఆలయాన్ని, శ్రీ కులం భారతి సరస్వతి ఆలయాన్ని తమదైన వాస్తు శైలిలో నిర్మాణాలు కొనసాగించారు. ఈ గ్రామానికి మరో ప్రాచీన ప్రత్యేకత ఏమిటంటే.. ముసలిమడుగు సీమలో అనే రాతి శాసనం పై ముసలిమడుగు కోట అని ప్రస్తావించబడింది.
అప్పట్లో ఈ ప్రాంతాన్ని పాలించిన పల్లవులు, శాతవాహనులు, కాకతీయులు కొంత నిధిని ఈ ముసలిమడుగు కోట లోపలి రాతిమెట్ల దిగుడు బావిలో నిక్షిప్తం చేసినట్లు కొన్ని రాతి శాసనలపై చెక్కారు. ప్రస్తుతం శ్రీశైలం డ్యాం డెడ్ స్టోరేజ్ కి వచ్చి సంగమేశ్వర తీర ప్రాంతమంతా పూర్తిగా నీరు తగ్గిపోయి ముసలిమడుగులో ఈ పురాతన ప్రాచీన భావి బయటపడింది.
దీంతో గుప్త నిధుల తవ్వకముఠాలు అర్ధరాత్రి ఈ బావి రాతి కట్టడాలను మోసం చేశారు. బావికి మూడు వైపులా లోతుగా తవ్వకాలు జరిపారు. ఓచోట తాంత్రిక క్రతువులు జరిగినట్లు రక్తపు ఆనవాళ్లు బయటపడ్డాయి.
ఈ బావికి సమీపంలో పూర్వం చక్రవర్తులు ముసలిమడుగు కోట ప్రకారం చుట్టూ లోతుగా గొయ్యి తవ్వించి అందులో భారీ ముసళ్లను కాపలాగా ఏర్పాటు చేయడం వల్లనే .. అప్పట్లో ఈ కోటకు ముసలిమడుగు కోట అని పేరు వచ్చింది. కృష్ణానది ఎండిపోవడంతో ఈ ప్రాచీన ముసలిమడుగు నీటిమనక కట్టడాల్లో ఇప్పటికీ ముసలి అవయవాల చిహ్నాలతో వెండి నాణ్యాలు, పంచలోహ విగ్రహాలు గ్రామస్తులకు దొరుకుతుంటాయి.
ఈ నేపథ్యంలో ఆత్మకూరు నల్లమలలో ప్రాచీన ఆలయాలలో గుప్త నిధుల తవ్వకాలు జరపడంలో 15 ముఠాలు పనిచేస్తున్నాయి. ఈ ముసలిమడుగు గ్రామానికి ఉత్తరాన అంకాలమ్మ కోట కొండపై ఇటీవల గుత్త నిదుర తవ్వకాలకు ఓ ముఠా ప్రయత్నించిందని ఆ ముఠా బృందమే ఈ తాజా తవ్వకాలకు కారణమై ఉండవచ్చని ఈ ప్రాంత ప్రజలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
ముసలిమడుగు గ్రామంలోని ప్రముఖ వ్యక్తుల సహకారంతోనే ఈ తవ్వకాలు జరిగినట్లు ప్రజలు చర్చించుకుంటున్నారు. ఎంతో ప్రాచీన వేల సంవత్సరాల చరిత్ర కలిగిన నిర్మాణాలు కృష్ణా, భవనాసిని నది తీరం వెంట ఎన్నోఉన్నాయి. వాటిని సంరక్షించి గుప్తనిధుల వేటగాళ్లను నియంత్రించాలని ఈ ప్రాంత ప్రజలు కోరుతున్నారు.




