Ardhaveedu: విద్యార్థుల మానసిక వికాసం, భద్రతపై ప్రత్యేక అవగాహన!

Ardhaveedu: సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో అర్థవీడు కేజీబీవీ పాఠశాలలో సైకాలజిస్ట్ లావణ్య విద్యార్థులకు మానసిక ఆరోగ్యం, జీవిత నైపుణ్యాలు, పోక్సో చట్టంపై అవగాహన కల్పించారు.

SREENIVAS YANNAM, MARKAPURAM
Published on: 18 Nov 2026 11:50 PM IST
Ardhaveedu
X

Ardhaveedu: విద్యార్థుల మానసిక వికాసం, భద్రతపై ప్రత్యేక అవగాహన!

అర్థవీడు: అర్థవీడు మండలంలోని KGBV అర్థవీడు పాఠశాలలో సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో విద్యార్థుల మానసిక వికాసం, వ్యక్తిత్వ అభివృద్ధి లక్ష్యంగా ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో జిల్లా మానసిక ఆరోగ్య, కెరీర్ గైడెన్స్ కౌన్సిలర్, సైకాలజిస్ట్ లావణ్య విద్యార్థులకు పలు కీలక అంశాలపై అవగాహన కల్పించారు. పిల్లల ప్రవర్తన, జీవిత నైపుణ్యాలు, వ్యక్తిగత అభిరుచులు, చిన్న చిన్న అలవాట్ల ప్రభావం, మంచి లక్షణాలు, చెడు లక్షణాలు, చెడు స్నేహాల వల్ల కలిగే పరిణామాలను వివరించారు.

అలాగే 10వ తరగతి, ఇంటర్మీడియట్ విద్యార్థులకు వ్యక్తిగత హద్దులు (Personal Boundaries), వ్యక్తిగత భద్రత, సురక్షితమైన మరియు అసురక్షిత పరిస్థితులను గుర్తించడం, పోక్సో (POCSO) చట్టంపై ప్రత్యేక అవగాహన కల్పించారు.

ఇతరులతో ఎలా మాట్లాడాలి, ఎలా ప్రవర్తించాలి, మాటతీరులో స్పష్టత, ఎవరిని నమ్మాలి, ఎవరితో అప్రమత్తంగా ఉండాలి వంటి అంశాలను వివరిస్తూ విద్యార్థులకు విలువైన సూచనలు అందించారు.

విద్యార్థులు తమ వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దుకోవడంతో పాటు, ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలని, తమ భద్రత పట్ల పూర్తి అవగాహన కలిగి ఉండాలని సైకాలజిస్ట్ లావణ్య సూచించారు.

ఈ కార్యక్రమంలో విద్యార్థులు, ఉపాధ్యాయినులు ఉత్సాహంగా పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

SREENIVAS YANNAM, MARKAPURAM

SREENIVAS YANNAM, MARKAPURAM