Kurnool: వొకేషనల్ కాలేజీలో ఘనంగా మహర్షి వాల్మీకి జయంతి!

Kurnool: కర్నూలు బి.క్యాంప్ ప్రభుత్వ వొకేషనల్ జూనియర్ కళాశాలలో మహర్షి వాల్మీకి జయంతి ఘనంగా జరిగింది. వాల్మీకి ఆదర్శాలను విద్యార్థులు అలవర్చుకోవాలని ప్రిన్సిపాల్ పిలుపునిచ్చారు.

V RAMAMOHAN, KURNOOL
Published on: 26 Oct 2026 11:07 PM IST
Kurnool
X

Kurnool: వొకేషనల్ కాలేజీలో ఘనంగా మహర్షి వాల్మీకి జయంతి!

కర్నూలు: కర్నూలు బి.క్యాంప్‌లోని ప్రభుత్వ వొకేషనల్ విద్యా జూనియర్ కళాశాలలో మహర్షి వాల్మీకి జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ మరియు NSS ప్రోగ్రామ్ ఆఫీసర్ డా. ఎస్. నాగస్వామి నాయక్ మాట్లాడుతూ, మహర్షి వాల్మీకి రచించిన రామాయణం భారతీయ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచిందని తెలిపారు. ఆయన రచనలు సమాజానికి ధర్మం, సత్యం, న్యాయం, మానవతా విలువలను బోధిస్తాయని పేర్కొన్నారు.

విద్యార్థులు మహర్షి వాల్మీకి జీవితాన్ని ఆదర్శంగా తీసుకొని, క్రమశిక్షణ, మంచి నడవడిక, నైతిక విలువలను అలవర్చుకోవాలని సూచించారు. మహర్షి వాల్మీకి జీవితం ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాయకమని, ఆయన సాహిత్య సేవలు తరతరాలకు మార్గదర్శకంగా నిలుస్తాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో కళాశాల సిబ్బంది వాణి ప్రసన్న, మల్లికార్జున, విజయశేఖర్, రామకృష్ణ, శారధి పటేల్, సుజాత, జబీన్ అక్తర్, లావణ్య, ఇంతియాజ్ పాల్గొన్నారు.

V RAMAMOHAN, KURNOOL

V RAMAMOHAN, KURNOOL