Nandikotkur: నందికొట్కూరులో ‘బడి పిలుస్తోంది’ భారీ ర్యాలీ

Nandikotkur: నందికొట్కూరులో బడి పిలుస్తోంది కార్యక్రమంలో భాగంగా భారీ ర్యాలీ నిర్వహించారు. విద్యార్థుల నమోదు కోసం అవగాహన కల్పించారు.

Iman Raju, Nandikotkur(Kurnool Dist)
Published on: 21 April 2026 10:34 AM IST
Nandikotkur
X

Nandikotkur

Nandikotkur: నందికొట్కూరులో ‘బడి పిలుస్తోంది’ కార్యక్రమంలో భాగంగా విద్యార్థుల నమోదు డ్రైవ్‌ను పురస్కరించుకొని భారీ అవగాహన ర్యాలీ నిర్వహించారు. 2026–2027 విద్యా సంవత్సరానికి రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 17 నుంచి 23 వరకు చేపట్టిన ఎన్‌రోల్‌మెంట్ కార్యక్రమంలో భాగంగా బైరెడ్డి నగర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆధ్వర్యంలో ఈ ర్యాలీ జరిగింది.

ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు కలిసి బైరెడ్డి నగర్ కాలనీ వీధుల గుండా ర్యాలీ నిర్వహించారు. రంగురంగుల జెండాలు, విద్య ప్రాముఖ్యతను తెలియజేసే బ్యానర్లతో నినాదాలు చేస్తూ ఇంటింటికీ అవగాహన కల్పించారు. అనంతరం బైరెడ్డి నగర్ కూడలిలో మానవహారంగా నిలబడి ప్రజలకు సందేశం ఇచ్చారు.

ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయురాలు కౌసల్యాబాయి మాట్లాడుతూ, ప్రభుత్వ పాఠశాలల్లో అన్ని సౌకర్యాలు, అర్హత కలిగిన ఉపాధ్యాయులు ఉన్నారని తెలిపారు. బడి ఈడు పిల్లలను తప్పనిసరిగా ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలని తల్లిదండ్రులను కోరారు.

పాఠశాల ఫిజికల్ డైరెక్టర్ శ్రీనాథ్ పెరుమాళ్ళ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ప్రథమ సహాయకురాలు సాలమ్మ, ఉపాధ్యాయులు విజయకుమారి, లలితమ్మ, లలితకుమారి, సరోజినీ దేవి, అనిత, వెంకటరమణ, ఈశ్వరయ్య, మల్లికార్జున రెడ్డి, వెంకటేశ్వర్లు, రామిరెడ్డి, నాగశేషులు, కంప్యూటర్ ఆపరేటర్ అజయ్ తదితరులు పాల్గొన్నారు.

Iman Raju, Nandikotkur(Kurnool Dist)

Iman Raju, Nandikotkur(Kurnool Dist)

Next Story