Srisailam: శ్రీశైలంలో మీడియాపై ఆంక్షలు ఎత్తివేయాలి.. లంబాడి హక్కుల పోరాట సమితి!
Srisailam: శ్రీశైలం ఆలయంలో మీడియాపై విధించిన ఆంక్షలను వెంటనే ఎత్తివేయాలని లంబాడి హక్కుల పోరాట సమితి (LHPS) డిమాండ్ చేసింది.
Srisailam: శ్రీశైలంలో మీడియాపై ఆంక్షలు ఎత్తివేయాలి.. లంబాడి హక్కుల పోరాట సమితి!
Srisailam: శ్రీ భ్రమరాంబ దేవి సమేత మల్లికార్జున స్వామి అమ్మవార్ల శ్రీశైల దేవస్థానంలో పారదర్శకతను ప్రశ్నించినందుకు శ్రీశైలం ఆలయంలోకి మీడియాపై ఆంక్షలు విధించడం అత్యంత విచారకరమని, ఈ చర్యను తీవ్రంగా ఖండిస్తున్నామని లంబాడి హక్కుల పోరాట సమితి నంద్యాల జిల్లా అధ్యక్షులు లు హనుమా నాయక్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. దేవస్థానంలో మీడియా స్వేచ్ఛను హరించడం, భక్తుల సమాచార హక్కును కాలరాయడమేనని వారు ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా సమితి నాయకులు మాట్లాడుతూ, కోట్లాది మంది భక్తుల విశ్వాసానికి ప్రతీక అయిన శ్రీశైల క్షేత్రంలో జరిగే సేవలు, ఉత్సవాలు, అభివృద్ధి పనులను ప్రజలకు చేరవేయడంలో మీడియా దశాబ్దాలుగా కీలక పాత్ర పోషిస్తోందని గుర్తు చేశారు.
ప్రజాస్వామ్యానికి నాలుగో స్తంభమైన మీడియాను పరిమితం చేయడం వల్ల దేవస్థాన పరిపాలనలో పారదర్శకత లోపించి, ప్రజల్లో అనవసర అనుమానాలకు తావిచ్చి నట్లవుతుందని హెచ్చరించారు. లంబాడి హక్కుల పోరాట సమితి ప్రధాన డిమాండ్లుగా తక్షణమే మీడియా ప్రతినిధులపై విధించిన పరిమితులను మరియు ఆంక్షలను తక్షణమే పునఃసమీక్షించి, పూర్తిగా ఎత్తివేయాలి అన్నారు.
ప్రింట్, ఎలక్ట్రానిక్, మరియు డిజిటల్ మీడియా రంగాలన్నింటికీ ఆలయ సమాచార సేకరణలో సమాన అవకాశాలు కల్పించాలన్నారు.




