Banaganapalle: బనగానపల్లెలో ఆశా వర్కర్ల వినతి: ఇందిరారెడ్డికి అందజేత

Banaganapalle: ఆశా వర్కర్ల వేతనాలు పెంచాలని, పర్మినెంట్ చేయాలని డిమాండ్ చేస్తూ బనగానపల్లెలో మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి సతీమణి ఇందిరారెడ్డికి వినతిపత్రం అందజేశారు.

Ramanaiah, Banaganepalle
Published on: 6 Oct 2026 3:49 PM IST
Banaganapalle
X

Banaganapalle: బనగానపల్లెలో ఆశా వర్కర్ల వినతి: ఇందిరారెడ్డికి అందజేత

నంద్యాల జిల్లా: ఆశావర్కర్స్ కు కనీస వేతనాలు పెంచాలని, పర్మినెంట్ చేయాలని సిఐటియు ఆధ్వర్యంలోబనగానపల్లె లో మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి సతీమణి ఇందిరా రెడ్డి కి వినతి పత్రం అందజేశారు

ఆంధ్రప్రదేశ్ ఆశా వర్కర్స్ యూనియన్ (సిఐటియు)ఆధ్వర్యంలో రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు అక్టోబర్ 6న రాష్ట్రంలోని ఎమ్మెల్యేలకు మరియు మంత్రులకు వేతనాలు పెంచాలని వినతి పత్రాలు ఇవ్వాలని పిలుపులో భాగంగా బనగానపల్లె పట్టణంలోని మంత్రి క్యాంపు కార్యాలయం నందు మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి సతీమణి బీసీ ఇందిరారెడ్డి కి ఆశా వర్కర్స్ డిమాండ్స్ తో కూడిన వినతి పత్రం ఇవ్వడం జరిగింది.

సిఐటియు జిల్లా నాయకులు సుధాకర్, జెవి సుబ్బయ్యలు మాట్లాడుతూ ఆశా వర్కర్స్ కి పనిభారం ఎక్కువైందని దానికి తగిన వేతనాలు పెంచాలని అలాగే వారిని పర్మినెంట్ చేయాలని, అన్ని రకాల సెలవులు ఇవ్వాలని ,జనాభాకు అనుగుణంగా ఆశా వర్కర్స్ పోస్టులు భర్తీ చేయాలని, ఏఎన్ఎం ,జిఎన్ఎమ్ శిక్షణ పొందిన వారికి స్టాప్ నర్సులుగా తీసుకొని పర్మినెంట్ చేయాలని, 10 లక్షల ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలని, అలాగే నాణ్యమైన మొబైల్స్, యూనిఫామ్ ఇవ్వాలని తదితర డిమాండ్లతో ప్రభుత్వం దృష్టికి తీసుకురావడం జరిగింది అన్నారు. ఈ కార్యక్రమంలో ఆశా వర్కర్స్ యూనియన్ నాయకులు రవణమ్మ, సరస్వతి, విజయలక్ష్మి ,మేరీ, విజయ,అరుణ ,లత మరియు ఆశా వర్కర్స్ పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Ramanaiah, Banaganepalle

Ramanaiah, Banaganepalle