Banaganapalle: బనగానపల్లెలో టీజీ వెంకటేష్ పుట్టినరోజు వేడుకలు

Banaganapalle: నంద్యాల జిల్లా బనగానపల్లెలో మాజీ రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేష్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి.

Ramanaiah, Banaganepalle
Published on: 16 May 2026 2:45 PM IST
Banaganapalle
X

Banaganapalle: బనగానపల్లెలో టీజీ వెంకటేష్ పుట్టినరోజు వేడుకలు

Banaganapalle: ఆర్యవైశ్య ముద్దుబిడ్డ ఆర్యవైశ్యుల అభ్యున్నతికి అహర్నిశలు కృషి కోసం ముందుండే నాయకుడు మాజీ రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేష్ పుట్టినరోజును పురస్కరించుకొని నంద్యాల జిల్లా ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు టంగుటూరి సీనయ్య ఆధ్వర్యంలో బనగానపల్లె పట్టణంలోని కొండపేట అమ్మవారి శాల నందు ప్రత్యేక పూజలు నిర్వహించి కేక్ కట్ చేసి సీట్లు పంచుకున్నారు.

నంద్యాల జిల్లా ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు టంగుటూరి సీనయ్య ఆధ్వర్యంలో బనగానపల్లె పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రి నందు పేషెంట్లకు,గర్భిణీ స్త్రీలకు బ్రెడ్లు పంపిణీ చేసి ప్రభుత్వ ఆసుపత్రి ఆసుపత్రి శానిటరీ వర్కర్స్ కు చీరల పంపిణీ చేశారు.

నంద్యాల జిల్లా ఆర్యవైశ్య అధ్యక్షులు సీనయ్య మాట్లాడుతూ ఆర్యవైశ్యులలో దివంగత గవర్నర్ పెండెకంటి వెంకటసుబ్బయ్య తర్వాత అంతా మహోన్నత వ్యక్తి టీజీ వెంకటేష్ అని ఆయన చేసే సేవలను గురించి కొనియాడారు. అలాగే ఆర్యవైశ్యుల కోసం అహర్నిశలు పోరాడే ఏకైక వ్యక్తి ఎంతోమందికి చేయూతనిచ్చిన గొప్ప వ్యక్తి టీజీ వెంకటేష్ అని అలాగే ఆయన పుట్టినరోజు సందర్భంగా ప్రతి సంవత్సరం నూతనంగా వివాహం చేసుకునే వారికి ఉచితంగా వివాహాలు నిర్వహించడం జరుగుతుందని అన్నారు.

Ramanaiah, Banaganepalle

Ramanaiah, Banaganepalle

Next Story