Banaganapalle: బనగానపల్లెలో మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి పర్యటన

Banaganapalle: నంద్యాల జిల్లా బనగానపల్లె పట్టణంలో మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి విస్తృత పర్యటన. చంద్రబాబు నాయుడు నగర్, ఈద్గా నగర్‌లలో స్థానిక సమస్యలపై ఆరా.

Ramanaiah, Banaganepalle
Published on: 31 May 2026 12:46 PM IST
Banaganapalle
X

Banaganapalle: బనగానపల్లెలో మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి పర్యటన

Banaganapalle: బనగానపల్లె పట్టణం లోని చంద్రబాబు నాయుడు నగర్, ఈద్గా నగర్ లో పర్యటించిన మంత్రి. కూటమి ప్రభుత్వంలో అభివృద్ధి - సంక్షేమ పాలనపై ప్రజల అభిప్రాయాలు అడిగి తెలుసుకున్న మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి. ప్రజలను స్థానిక సమస్యలు అడిగి తెలుసుకున్న మంత్రి. తమ ప్రాంతంలో మురికినీటి సమస్య తీవ్రంగా ఉందని మంత్రి దృష్టికి తీసుకువచ్చిన కాలనీవాసులు. రేపటిలోగా మురుగునీరు సక్రమంగా వెళ్లేలా డ్రైనేజీ కాలువలో పూడికతీతను తీయాలని అధికారులకు మంత్రి ఆదేశం. స్థానికంగా ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పనలో భాగంగా రోడ్లు, డ్రైనేజీలు, త్రాగునీరు, విద్యుత్ కనెక్షన్లు కల్పించాలని అధికారులకు సూచించిన మంత్రి.

బనగానపల్లె లో ఎస్ ఆర్ బి సి కెనాల్ సమీపంలో నూతనంగా కార్పెంటర్ కాలనీ నిర్మాణానికి స్థల పరిశీలన చేసిన మంత్రి. ఈ సందర్భంగా నూతనంగా ఏర్పాటు చేసే కాలనీలో ప్రజలకు అవసరమైన కనీస మౌలిక సదుపాయాలను కల్పించాలని అధికారులకు సూచించిన మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి.

Ramanaiah, Banaganepalle

Ramanaiah, Banaganepalle

Next Story