Banaganapalle: ఘనంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు
Banaganapalle: బనగానపల్లెలో బైక్ ర్యాలీ, యాగంటి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలను ఘనంగా జరుపుకున్నారు.
Banaganapalle: ఘనంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు
బనగానపల్లె: నంద్యాల జిల్లా బనగానపల్లె మండలం పాతపాడు గ్రామంలో జనసేన నాయకులు దొడియం గుర్రప్ప ఆధ్వర్యంలో నిర్వహించారు.జనసేన నాయకులు , షేక్షావలి, మెగా యూత్ ఫోర్స్ నియోజకవర్గ కో కన్వీనర్ ప్రసాద్ ఆధ్వర్యంలో కోవెలకుంట్ల నుండి బనగానపల్లె మీదుగా యాగంటికీ బైక్ ర్యాలీ నిర్వహించారు.
యాగంటి ఉమామహేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి సతీమణి బిసి.ఇందిరమ్మ ముఖ్యఅతిథిగా పాల్గొని కేక్ కట్ చేశారు. అనంతరం ఆమె మెగా రక్తదాన శిబిరాన్ని సందర్శించి రక్తదాతలను ప్రశంసించారు.
ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు దొడియం గురప్ప, ప్రసాద్, నాగ ప్రసాద్, మార్కెట్ యార్డ్ డైరెక్టర్ కోవెలకుంట్ల చెన్న కిట్టు, బోధనం ఓబులేసు, ఇమామ్, నీలి రమేష్, ప్రభాకర్, పోతుల మురళి,చంద్రశేఖర్, కులాయి,హుస్సేన్, జస్వంత్ రెడ్డి, సంజీవ,శ్రీను, ఆంజనేయులు,పేరూరు గురప్ప,రమేష్, విజయ్, వికాస్, అనిల్ మరియు పెద్ద సంఖ్యలో జనసైనికులు పాల్గొన్నారు.




