Nandavaram: నందవరంలో ఘనంగా చౌడేశ్వరి దేవి అమ్మవారి జయంతి
Nandavaram: బనగానపల్లె మండలం నందవరం చౌడేశ్వరి దేవి జయంతి వేడుకలు భక్తిశ్రద్ధలతో నిర్వహణ. అమ్మవారిని దర్శించుకున్న మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి సతీమణి ఇందిరమ్మ.
Nandavaram: నందవరంలో ఘనంగా చౌడేశ్వరి దేవి అమ్మవారి జయంతి
నందవరం: బనగానపల్లె మండలం నందవరం గ్రామంలో కాశీ విశాలాక్షి ప్రతిరూపమైన చౌడేశ్వరి దేవి అమ్మవారి జయంతి వేడుకలు బుధవారం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. చౌడేశ్వరి దేవి అమ్మవారికి ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించారు
అమ్మవారి జయంతిని పురస్కరించుకొని రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి సతీమణి బిసి ఇందిరమ్మ అమ్మవారిని దర్శించుకొని చండీ హోమంలో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు.
వేలాది మంది భక్తులకు అన్నదాన వితరణ చేసిన ఆలయ అసిస్టెంట్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి, ఆలయ చైర్మన్ నాగార్జున రెడ్డి, పివి కుమార్ రెడ్డి బనగానపల్లె రూరల్ సీఐ మంజునాథరెడ్డి, బోయ వెంగన్న తదితరులు పాల్గొన్నారు.
Next Story




