Banaganapalli: బనగానపల్లెలో దస్తావేజు లేఖర్ల నల్ల బ్యాడ్జీల నిరసన
Banaganapalli: రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాల ఏర్పాటు జీవో 396ను ఉపసంహరించుకోవాలని బనగానపల్లెలో స్టాంప్ రైటర్స్ నిరసన. జీవనోపాధి దెబ్బతింటుందని ఆవేదన.
Banaganapalli: బనగానపల్లెలో దస్తావేజు లేఖర్ల నల్ల బ్యాడ్జీల నిరసన
బనగానపల్లె: సబ్ రిజిష్ట్రేషన్ సేవా కేంద్రాలను రద్దు చేయాలనే జిఓను ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలని బనగానపల్లె స్టాంప్ రైటర్స్ అండ్ వెండర్స్ అసోసియేషన్ నాయకులు రామకృష్ణ,మల్లేశుడు మధుసుదన్ రావు, సుబ్బరాయుడు,రఫీ, సుబ్బారావు, నవీద్, సన్నీ, సందీప్ లు నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలుపుతూ డిమాండ్ చేశారుఈ బనగానపల్లె స్టాంప్ రైటర్స్ మాట్లాడుతూ ప్రభుత్వము ప్రవేశ పెట్టబోవు రిజిష్ట్రేషన్ సేవా కేంద్రాలను రద్దు చేయాలని, ప్రతిపాదించిన జిఓ ఎంఎస్ నెంబర్.396 ను ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.
వీటి వల్ల ప్రజల ఆస్తులకు భద్రత లోపించడమే గాక అనేక సంవత్సరాలుగా దస్తావేజులు వ్రాసుకుంటూ దస్తావేజు లేఖరులుగా,స్టాంపు వెండర్లుగా జీవనాన్ని కొనసాగిస్తున్న దస్తావేజు లేఖర్ల జీవనోపాధికి విఘాతము కలిగే పరిస్థితి ఏర్పడే అవకాశం ఉందన్నారు.ఈ పాలన దాదాపు 140 సంవత్సరాల నుంచి కొనసాగుతుందని దీనిని ప్రభుత్వం గుర్తించాలని ఈ విషయములను గురించి రాష్ట్ర వ్యాప్తంగా వున్న దస్తావేజు లేఖర్లు,స్టాంపు వెండర్లు నిరసనలు చేస్తున్న నేపధ్యములో బనగానపల్లె సబ్ రిజిస్టర్ కార్యాలయ పరిధి దస్తావేజులేఖరులు స్టాంపు వెండర్లు శాంతియుతంగా నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలియజేశారు.
ప్రభుత్వము స్టాంప్ రైటర్స్ అండ్ వండర్స్ వారిని దృష్టిలో వుంచుకొని జిఓ ఎంఎస్ నెంబర్ 396ను రద్దు చేయాలని,రిజిష్ట్రేషన్ శాఖను ప్రైవేటుపరము కాకుండా ఆపాలని,ప్రజల ఆస్తులకు భద్రత కల్పించాలని, రిజిష్ట్రేషన్ డిపార్టుమెంటునే నమ్ముకొని దస్తావేజు లేఖరులుగా,స్టాంపు వెండర్లుగా కొనసాగుతూ కుటుంబాలను పోషించుకుంటున్న మమ్ములను మా కుటుంబాలను ఆదుకోవాలని వారు కోరారు ఈ కార్యక్రమంలో స్టాంప్ రైటర్లు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.




