Srisailam: క్షేత్రపాలకుడు 'బయలు వీరభద్రస్వామి'కి ప్రదోషకాల విశేష అభిషేకం!

Srisailam: వీరభద్రస్వామి వారికి మంగళవారం సాయంకాలం ప్రదోషకాలంలో దేవస్థానం అధికారులు విశేష అభిషేకాలు, అర్చనలు నిర్వహించారు.

P NAGESWARA RAO, SRISAILAM
Published on: 21 July 2026 10:43 PM IST
Srisailam
X

Srisailam: క్షేత్రపాలకుడు 'బయలు వీరభద్రస్వామి'కి ప్రదోషకాల విశేష అభిషేకం!

శ్రీశైలం: లోకకల్యాణం కోసం శ్రీశైల దేవస్థానం మంగళవారం సాయంకాలం శ్రీశైలక్షేత్ర పాలకుడైన శ్రీబయలు వీరభద్రస్వామివారికి విశేషపూజలను నిర్వహించారు.ప్రతీ మంగళవారం మరియు అమావాస్యరోజులలో బయలువీరభద్రస్వామివారికి ఈ విశేష అభిషేకం, అర్చనలను నిర్వహించబడుతున్నాయి.

కాగా బయలు వీరభద్రస్వామివారు శివభక్తగణాలకు అధిపతి. అదేవిధంగా శ్రీశైలక్షేత్రపాలకుడుగా క్షేత్రానికి ఆరుబయట ఉండి, ఎటువంటి ఆచ్ఛాదన, ఆలయం లేకుండగా బయలుగా దర్శనమిస్తాడు కనుక ఆయనకు బయలువీరభద్రస్వామి అని పేరు వచ్చింది. ప్రసన్నవదనంతో కిరీట మకుటాన్ని కలిగి దశభుజుడైన స్వామివారు పది చేతులలో వివిధ ఆయుధాలతో దర్శనమిస్తాడు.

స్వామివారికి క్రిందివైపున కుడివైపు దక్షుడు, ఎడమవైపు భద్రకాళి దర్శనమిస్తారు. ఈ స్వామిని దర్శించినంత మాత్రానే ఎంతటి క్లిష్ట సమస్యలైనా తొలగిపోతాయని, వ్యాధులు నశించి ఆయురారోగ్యాలు చేకూరుతాయని ప్రసిద్ధి.

ముఖ్యంగా ఆగమసంప్రదాయంలో క్షేత్రపాలక పూజకు చాలా విశేషస్థానం ఉంది. క్షేత్ర పాలకుడికి పూజలు చేయడం వలన ఆ క్షేత్రంలో ఉన్నటువంటి భక్తులు ఎటువంటి భయం,బాధలు లేకుండా సుఖసంతోషాలతో ఉంటారు. మంగళవారం, ఆదివారం మరియు అమావాస్య రోజులలో చేసే వీరభద్రపూజ అనేక ఫలితాలు ఇస్తుందని ఆగమశాస్త్రాలు చెబుతున్నాయి. ఈ స్వామిపూజతో సకలగ్రహ అరిష్టదోషాలు, దుష్టగ్రహపీడలు తొలగిపోతాయి. అదేవిధంగా సంతానం, ఐశ్వర్యం మొదలైన అనేక శుభఫలితాలు చేకూరుతాయి.

ఈ పూజాదికాలలో పంచామృతాలతోనూ, బిల్వోదకం, కుంకుమోదకం, హరిద్రోదకం, భస్మోదకం, గంధోదకం, పుష్పోదకం, శుద్ధజలాలతో స్వామివారికి అభిషేకం నిర్వహించడం జరిగింది.

P NAGESWARA RAO, SRISAILAM

P NAGESWARA RAO, SRISAILAM

Next Story