Banaganapalle: విద్యార్థులతో ముచ్చటించి పరిశుభ్రతపై సూచనలు!
Banaganapalle: నంద్యాల జిల్లా బనగానపల్లెలోని జెడ్పీ ఉన్నత పాఠశాలకు మంత్రి బీసీ జనార్థన్ రెడ్డి సతీమణి బీసీ ఇందిరా రెడ్డి రూ.1 లక్ష విలువైన 25 టేబుళ్లను విరాళంగా అందజేశారు.
Banaganapalle: విద్యార్థులతో ముచ్చటించి పరిశుభ్రతపై సూచనలు!
Banaganapalle: బనగానపల్లె పట్టణంలోని కొండపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయుల అవసరాల కోసం సుమారు రూ.1 లక్ష విలువైన 25 టేబుల్స్ను రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్థన్ రెడ్డి సతీమణి బీసీ ఇందిరా రెడ్డి విరాళంగా అందజేశారు.
పాఠశాల విద్యార్థులతో మాట్లాడిన బీసీ ఇందిరా రెడ్డి పాఠశాల ప్రాంగణాన్ని ఎల్లప్పుడూ పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. ప్లాస్టిక్ వినియోగాన్ని పూర్తిగా నివారించి, పర్యావరణ పరిరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని విద్యార్థులకు తెలిపారు.
పాఠశాల ఆవరణలో మొక్కలు నాటారు. మొక్కల సంరక్షణ, పచ్చదనం పెంపొందించడం, పర్యావరణ పరిరక్షణ ప్రాధాన్యతపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. విద్యార్థులు చదువుతో పాటు సామాజిక బాధ్యత, పరిశుభ్రత, పర్యావరణ పరిరక్షణ వంటి అంశాలపై కూడా చైతన్యం పెంచుకోవాలని సూచించారు.




