Nandyal: సంక్షేమ పథకాల జోరు పింఛన్ల పంపిణీలో మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి
Nandyal: నంద్యాల జిల్లా బనగానపల్లెలో ఎన్టీఆర్ భరోసా పింఛన్లు అందజేసి రూ. 64 లక్షల అభివృద్ధి పనులను ప్రారంభించిన ఆర్ అండ్ బి శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి.
Nandyal: సంక్షేమ పథకాల జోరు పింఛన్ల పంపిణీలో మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి
Nandyal: నంద్యాల జిల్లా బనగానపల్లె పట్టణంలోని రంగరాజుపేట లో ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్లు పంపిణీ చేసిన పాల్గొన్న రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి. అనంతరం 64 లక్షలతో నిర్మించిన సిసి రోడ్లు అండర్ డ్రైనేజీ కాల్వల నిర్మాణాలను ప్రారంభించిన మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి.
బనగానపల్లె పట్టణం ఒక చరిత్ర బనగానపల్లె గ్రామపంచాయతీ పరిధిలో 60 కోట్లతో సీసీ రోడ్లు అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులు పూర్తి చేశాం మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి 13 కోట్లతో జుర్రెరు వాగును అభివృద్ధి చేస్తున్నాం.
బనగానపల్లె పట్టణంలో అర్హులైన ప్రతి ఒక్కరికి ఇళ్ల పట్టాలు ఇస్తున్నాం. ఉదయం స్వయంగా లబ్ధిదారుల ఇంటింటికి వెళ్లి, వారి యోగ - క్షేమాలు అడిగి తెలుసుకుని ఇంటి వద్దే అవ్వాతాతలకు పింఛన్లు అందజేసిన మంత్రి బీసీ జనార్థన్ రెడ్డి. సంక్షేమం అభివృద్ధి సమానంగా చూస్తున్నాం గత నెలలో తల్లికి వందనం అందరికీ ఇచ్చాం శ్రీ శక్తి మహిళలు సంతోషంగా ఉన్నారు.
యువతకు 16,600 మంది డిఎస్సీ ఉద్యోగాలు ఇచ్చాం, కొలిమిగుండ్ల మండలంలో6వేల టన్నులతో అల్ట్రాటెక్ సిమెంట్ సిమెంట్ కర్మాగారం ఏర్పాటు చేశాం. పింఛన్ల పంపిణీ సందర్భంగా స్థానికంగా ప్రజా సమస్యలు, మౌలిక సదుపాయాల కల్పన, ప్రభుత్వ పనితీరు వంటి అంశాలపై నేరుగా ప్రజల అభిప్రాయాలను అడిగి తెసుకున్న మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి.
చంద్రబాబు ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వం.. ప్రజల అభివృద్ధి సంక్షేమం కాంక్షించే మంచి ప్రభుత్వం” అన్న మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి. ఇచ్చిన మాటకు కట్టుబడి అధికారం చేపట్టిన వెంటనే రూ. 3 వేల నుంచి 4 వేలకు పెన్షన్ పెంచిన ఘనత చంద్రబాబుదే. ప్రతి నెల ఒకటవ తేదీనే లబ్ధిదారులకు ఫించన్లు అందజేస్తోందన్న ప్రభుత్వం తమది. రాష్ట్రంలో ప్రతి నెలా క్రమం తప్పకుండా దాదాపుగా 64 లక్షల మందికి పైగా లబ్ధిదారులకు పెన్షన్లు అందిస్తున్నాం.--మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి. కార్యక్రమంలో పాల్గొన్న అధికారులు కూటమి నాయకులు కార్యకర్తలు.




