Devanakonda: దేవనకొండలో భగ్గుమన్న వాల్మీకి బోయల వివాదం..!
Devanakonda: కర్నూలు జిల్లా దేవనకొండలో వాల్మీకి బోయలను కించపరిచిన ఆళ్లూరు వైసీపీ నేత వైకుంఠం మల్లికార్జున బహిరంగ క్షమాపణ చెప్పాలని సురేంద్ర డిమాండ్ చేశారు.
Devanakonda: దేవనకొండలో భగ్గుమన్న వాల్మీకి బోయల వివాదం..!
Devanakonda: బహిరంగ క్షమాపణ చెప్పాలి సమావేశంలో మాట్లాడుతున్న కప్పట్రాల సురేంద్ర నాయుడుదేవనకొండవాల్మీకి బోయలను కించపరిచేలా మాట్లాడిన ఆలూరు వైసీపీ నాయకుడు వైకుంఠం మల్లికార్జున వెంటనే బహిరంగ క్షమాపణ చెప్పాలని జాతీయ బీసీ సంఘం యూత్ ప్రెసిడెంట్ కప్పట్రాల సురేంద్ర నాయుడు డిమాండ్ చేశారు.
శుక్రవారం దేవనకొండలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. వాల్మీకి బోయల గురించి చేసిన వ్యాఖ్యలు తమ సమాజం మనోభావాలను దెబ్బతీసేలా ఉన్నాయని, ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. అన్నం పెట్టిన వారికి హత్యలు చేస్తారని వాల్మీకి బోయలపై వ్యాఖ్యానించడం తీవ్రంగా అభ్యంతరకరమని పేర్కొన్నారు.
వాల్మీకి మహర్షి రచించిన రామాయణం ప్రపంచానికి ఆదర్శంగా నిలిచిన శ్రీరాముని జీవితాన్ని పరిచయం చేసిన మహత్తర కావ్యమని సురేంద్ర నాయుడు అన్నారు. అలాంటి మహనీయుని వారసులుగా వాల్మీకి బోయలకు గొప్ప చరిత్ర, సంస్కృతి, ఆత్మగౌరవం ఉన్నాయని తెలిపారు.
రాజకీయ భేదాలు ఉండవచ్చని, అయితే కులాలను కించపరిచేలా వ్యాఖ్యలు చేయడం సమాజంలో విభేదాలకు దారితీస్తుందని అన్నారు. వాల్మీకి బోయలను అవమానించే వ్యాఖ్యలను తాము తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పారు.వైకుంఠం మల్లికార్జున వెంటనే తన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చి, వాల్మీకి బోయ సమాజానికి బహిరంగ క్షమాపణ చెప్పాలని కప్పట్రాల సురేంద్ర నాయుడు డిమాండ్ చేశారు.




