Banaganapalle: బనగానపల్లె ప్రజల కోసం మాజీ సర్పంచ్ గొప్ప నిర్ణయం
Banaganapalle: బనగానపల్లె పట్టణ మాజీ సర్పంచ్ బి.సి. రాజారెడ్డి తన తల్లిదండ్రుల జ్ఞాపకార్థం 'మానవతా సాయం' ప్రారంభించారు.
Banaganapalle: బనగానపల్లె ప్రజల కోసం మాజీ సర్పంచ్ గొప్ప నిర్ణయం
Banaganapalle: మానవతా సాయానికి శ్రీకారం బిసి రాజారెడ్డి, మా తల్లిదండ్రులు కీ.శే. బిసి గుర్రెడ్డి , కీ.శే బిసి లక్ష్మమ్మ గార్ల జ్ఞాపకార్థం `మానవతా సాయం' బనగానపల్లె పట్టణంలో ఎవరైనా మరణిస్తే ఆ కుటుంబానికి అండగా ఉండేందుకు రూ.10000 మానవతా సాయం. మానవతా సాయం కోసం ఏడాదికి రూ.30 లక్షలు కేటాయింపు. కుల మతాలు, రాజకీయాలకు అతీతంగా మానవతా సాయం. మా కార్యాలయం నందు మానవత సాయం కోసం ఎవరైనా సంప్రదించవచ్చు బిసి రాజారెడ్డి.
మరణ వార్త కుటుంబంలో ఎంత విషాదాన్ని పంపుతుందో మనందరికీ తెలిసిందే. ఆ విషాదం నిండిన కుటుంబానికి ఆసరాగా ఉండేందుకు మానవత సాయం కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు బనగానపల్లె పట్టణ మాజీ సర్పంచ్ బిసి రాజారెడ్డి తెలిపారు. బనగానపల్లె పట్టణం ఎంఎస్ ఫంక్షన్ హాల్ నందు బిసి కుటుంబ అభిమానులు, టిడిపి నాయకులు, కార్యకర్తలతో సమావేశం ఏర్పాటు చేసి మానవతా సాయం వివరాలను బిసి రాజారెడ్డి వెల్లడించారు.
మా తల్లిదండ్రులు కీ.శే. బిసి గుర్రెడ్డి, కీ.శే బిసి లక్ష్మమ్మ గార్ల జ్ఞాపకార్థం మానవతా సాయం పేరుతో బనగానపల్లె పట్టణంలో ఎవరైనా మృతి చెందితే కష్ట సమయంలో ఉన్న ఆ కుటుంబానికి అండగా ఉండేందుకు రూ.10000 నగదు అందజేస్తామన్నారు. తాను పుట్టింది, పెరిగింది, చదివింది అంతా బనగానపల్లె పట్టణంలోనే అన్నారు. తనను ఎంతగానో ఆదరించి, అభిమానించే బనగానపల్లె పట్టణ ప్రజలకు మంచి చేయాలనే సద్దుదేశంతో సేవా కార్యక్రమాలు చేయడం జరుగుతుందన్నారు.
కుల మతాలకు, రాజకీయాలకు అతీతంగా ఈ మానవతా సాయం కార్యక్రమం ఉంటుందన్నారు. ముఖ్యంగా బనగానపల్లె పట్టణంలోని వారికి మాత్రమే ఈ మానవతా సాయం వర్తిస్తుందని తెలిపారు. పట్టణంలో ఎవరైనా మృతి చెందితే వారి కుటుంబ సభ్యులు లేదా రక్త సంబంధీకులు ఒకరు మా కార్యాలయం నందు సంప్రదిస్తే వారికి మానవత సాయం కింద రూ.10 వేల నగదును అందిస్తామన్నారు.
మృతికి సంబంధించిన వారి ఆధార్ కార్డు జిరాక్స్ కాపీ తో పాటు పూర్తి వివరాలతో స్వతంత్రంగా ఎవరైనా సంప్రదించవచ్చన్నారు. మృతి చెందిన వారి వయసుతో సంబంధం లేదన్నారు. ఈ కార్యక్రమాన్ని రాజకీయాలతో సంబంధం లేకుండా కష్ట సమయంలో ఉన్న ఎవరైనా సరే ఉదయం 10 గంటల తర్వాత తమ కార్యాలయం నందు స్వతంత్రంగా సంప్రదించవచ్చని లేదా తెలిసిన వారి ద్వారా అయినా సంప్రదిస్తే వారికి మానవత సాయం అందిస్తామన్నారు. కార్యక్రమంలో బిసి కుటుంబ అభిమానులు, టిడిపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.




