Srisailam: నందికొట్కూరులో 107వ రోజుకు చేరిన ముంపు నిర్వాసితుల దీక్ష!

Srisailam: శ్రీశైలం ప్రాజెక్ట్ ముంపు నిర్వాసితుల దీక్షకు బీసీవై పార్టీ అధినేత బోడే రామచంద్ర యాదవ్ సంఘీభావం.

Iman Raju, Nandikotkur(Kurnool Dist)
Published on: 11 July 2026 11:11 AM IST
Srisailam
X

Srisailam: నందికొట్కూరులో 107వ రోజుకు చేరిన ముంపు నిర్వాసితుల దీక్ష!

Srisailam: నందికొట్కూరులో 107 రోజులుగా కొనసాగుతున్న శ్రీశైలం నీటి ముంపు నిర్వాసితుల దీక్షా శిబిరానికి శుక్రవారం బీసీవై పార్టీ అధ్యక్షుడు బోడే రామచంద్ర యాదవ్ హాజరై నిర్వాసితులకు సంఘీభావం తెలిపారు.

గత 40 ఏళ్లలో ఏ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని రామచంద్ర యాదవ్ విమర్శించారు. దివంగత ఎన్టీఆర్ తెచ్చిన 98 జీవో ప్రకారం నిర్వాసితులకు ఉద్యోగాలు కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ జీవో అమలుకు మంత్రి నారా లోకేష్ కృషి చేయాలని కోరారు. సుమారుగా 620 కుటుంబాలు శ్రీశైలం ప్రాజెక్ట్ కోసం తమ సర్వస్వం కోల్పోయిన

నిర్వాసితుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించకపోతే భారీ ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు. అదే సమయంలో 98 జీవో కోసం పోరాడి మృతి చెందిన 32 కుటుంబాలకు తమ పార్టీ తరపున ఒక్కో కుటుంబానికి పదివేల రూపాయల ఆర్థిక సాయాన్ని ప్రకటించారు.

ఈ కార్యక్రమంలో శ్రీశైలం నీటి ముంపు నిర్వాసితుల పోరాట సమితి నాయకుడు జయన్న,మరియు వామపక్ష పార్టీ నాయకులు రఘురామ మూర్తి ,వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.

Iman Raju, Nandikotkur(Kurnool Dist)

Iman Raju, Nandikotkur(Kurnool Dist)

Next Story