Sunnipenta: సుండిపెంటలో ఘనంగా భగత్ సింగ్ 119వ జయంతి వేడుకలు!
Sunnipenta: నంద్యాల జిల్లా సుండిపెంటలో ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో భగత్ సింగ్ 119వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించి నివాళులర్పించారు.
Sunnipenta: సుండిపెంటలో ఘనంగా భగత్ సింగ్ 119వ జయంతి వేడుకలు!
Sunnipenta: సున్నిపెంటలో ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో భగత్ సింగ్ 119వ జయంతి వేడుకలను సోమవారం ఘనంగా నిర్వహించారు. ఏఐవైఎఫ్ కార్యదర్శి బి. లక్ష్మయ్య ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో భగత్ సింగ్ చిత్రపటానికి నివాళులు అర్పించారు.
ఈసందర్భంగా భగత్ సింగ్ దేశ స్వాతంత్ర్యం కోసం చేసిన త్యాగాలను, ఆయన ఆశయాలను నాయకులు గుర్తు చేసుకున్నారు. యువత భగత్ సింగ్ స్ఫూర్తితో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఏఐవైఎఫ్ నాయకులు మళ్లీ శ్రీనివాసులు, రమణ, సత్యం, రాము, షాహిద్, జబీర్, ఆరిఫ్, గాలయ్య, కలిందర్, రాము పీర్ వినోద్ విజయ్ తదితరులు పాల్గొన్నారు.




