Markapuram: మోదీ 25 ఏళ్ల సేవా సంకల్ప ఉత్సవాలు ఏలూరి!

Markapuram: ప్రధాని మోదీ 76వ పుట్టినరోజును పురస్కరించుకుని ఈ నెల 17న 'మోదీ 25 ఏళ్ల సేవా సంకల్ప ఉత్సవాలు' ఘనంగా జరుపుకోవాలని బీజేపీ నేత ఏలూరి రామచంద్రారెడ్డి పిలుపునిచ్చారు.

SREENIVAS YANNAM, MARKAPURAM
Published on: 4 Sept 2026 3:36 PM IST
Markapuram
X

Markapuram: మోదీ 25 ఏళ్ల సేవా సంకల్ప ఉత్సవాలు ఏలూరి!

Markapuram: ప్రధాని నరేంద్ర మోదీ 76వ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ నెల 17న ‘మోదీ 25 ఏళ్ల సేవా సంకల్ప ఉత్సవాలను’ ఘనంగా నిర్వహించుకుందామని బీజేపీ రాష్ట్ర మీడియా ప్రతినిధి డా. ఏలూరి రామచంద్రారెడ్డి పిలుపునిచ్చారు.

దేశ ప్రజల సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలన కోసం ప్రధాని మోదీ కొనసాగిస్తున్న ప్రజాసేవను గుర్తు చేసుకుంటూ ఉత్సవాలను నిర్వహించాలని కోరారు. ముఖ్యంగా యువత, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని పోస్టుకార్డుల ద్వారా ప్రధానికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయాలని సూచించారు.

యువతలో దేశభక్తి, సేవాభావం, జాతీయ నిర్మాణం పట్ల బాధ్యతను పెంపొందించేలా కార్యక్రమాలను విస్తృతంగా నిర్వహించాలని రామచంద్రారెడ్డి అన్నారు. ప్రధాని మోదీ నాయకత్వంలో దేశం అభివృద్ధి పథంలో ముందుకు సాగుతోందని పేర్కొన్నారు.

ఆత్మనిర్భర్ భారత్, సుపరిపాలన, ఆర్థిక ప్రగతి, సాంకేతిక అభివృద్ధితో పాటు ప్రపంచ వేదికపై భారతదేశ గౌరవం మరింత బలోపేతమవుతోందని తెలిపారు. మోదీ 25 ఏళ్ల అంకితభావ ప్రజాసేవ, దార్శనిక నాయకత్వం దేశానికి స్ఫూర్తిదాయకమని అన్నారు.

జన్మదిన వేడుకలను సేవా కార్యక్రమాలతో ముడిపెట్టి ప్రజలకు మరింత చేరువయ్యేలా నిర్వహించాలని కోరారు. యువత, విద్యార్థులు ఉత్సాహంగా భాగస్వాములై ‘సేవే సంకల్పం – దేశమే ప్రథమం’ అనే స్ఫూర్తిని చాటాలని పిలుపునిచ్చారు.

SREENIVAS YANNAM, MARKAPURAM

SREENIVAS YANNAM, MARKAPURAM

Next Story