Kurnool: మట్టి తవ్వకాల గొడవలో యువకుడి దారుణ హత్య!
Kurnool: కర్నూలు జిల్లా సి.బెళగల్ మండలం పోలకల్లో దారుణ హత్య.
Kurnool: మట్టి తవ్వకాల గొడవలో యువకుడి దారుణ హత్య!
Kurnool: సి.బెళగల్ మండలం ఫ్యాక్షన్ గ్రామమైన పోలకల్ లో దారుణ హత్య జరిగింది. జగన్ అనే యువకుడిని ప్రత్యర్ధులు దారుణంగా హత్య చేసారు.
బ్రాహ్మణ దొడ్డి లోని గురుతిప్ప దగ్గర ఎర్రమట్టి తవ్వకాలను జరుపుతున్న టిడిపి నాయకులను జగన్ అడ్డుకోవడంతో ఘర్షణ చెలరేగింది.
దీంతో జగన్ పై టిడిపి వర్గీయులు దాడి చేయడంతో.. తీవ్రంగా గాయపడిన జగన్ ను పెంచికలపాడులోని విశ్వభారతి ఆసుపత్రికి తరలించగా..
చికిత్స పొందుతూ మృతి చెందాడని బంధువులు తెలిపారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Next Story




