Kurnool: బిఎస్ఎన్ఎల్ ఆఫీస్ లో అగ్నిప్రమాదం
Kurnool: కర్నూలు నగరంలోని BSNL ఆఫీసులో బుధవారం తెల్లవారుజామున భారీ అగ్నిప్రమాదం జరిగింది.
Kurnool: బిఎస్ఎన్ఎల్ ఆఫీస్ లో అగ్నిప్రమాదం
కర్నూలు: నగరంలోని ప్రభుత్వ ప్రింటింగ్ ప్రెస్ పక్కనే ఉన్న బిఎస్ఎన్ఎల్ ఆఫీస్ లో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఉదయం 6గంటల సమయంలో బిఎస్ఎన్ఎల్ ఆఫీస్ లోని మొదటి అంతస్తులో సెల్ టవర్ కోసం ఏర్పాటు చేసిన ఆఫీసు లో మంటలు చెలరేగాయి. మంటలను గమనించిన స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు.
సమాచారం అందుకున్న వెంటనే సంఘటన స్థలానికి చేరుకొని మంటలను ఆర్పివేశారు. సెల్ టవర్ కోసం ఏర్పాటు చేసిన 4జీ బీటీఎస్, 2జీ బీటీఎస్, బ్యాటరీలు, ఫర్నిచర్ పూర్తి తగలపడిపోయాయి. సుమారు 12 లక్షల రూపాయల వరకు నష్టం జరిగి ఉంటుందని బిఎస్ఎన్ఎల్ అధికారులు అంచనా వేస్తున్నారు.జరిగిన అగ్నిప్రమాదంపై అగ్నిమాపక శాఖ అధికారులు విచారణ చేపట్టారు.
Next Story




