Kovelkuntla: కోవెలకుంట్లలో చోరీ.. రూ.5 లక్షల బంగారం అపహరణ
Kovelkuntla: నంద్యాల జిల్లా కోవెలకుంట్లలో ఇంటి తలుపులు పగలగొట్టి రూ.5 లక్షల విలువైన బంగారం, వెండి వస్తువులు దొంగలు అపహరించారు.
Kovelkuntla: నంద్యాల జిల్లా కోవెలకుంట్ల పట్టణంలోని స్కంద కాలనీలో చోరీ ఘటన చోటుచేసుకుంది. స్థానికంగా నివసిస్తున్న శ్రీనివాసులు కుటుంబ సభ్యులతో కలిసి పాణ్యంలో జరిగిన బంధువుల వివాహానికి హాజరుకావడానికి ఇంటికి తాళాలు వేసి వెళ్లారు.
ఈ సమయంలో గుర్తుతెలియని దుండగులు ఇంటి తలుపులు పగలగొట్టి లోపలికి ప్రవేశించి మూడు జతల బంగారు కమ్మలు, చెంప చారలు, పలు వెండి వస్తువులను అపహరించినట్లు బాధితుడు శ్రీనివాసులు తెలిపారు.
దొంగిలించబడిన ఆభరణాలు, వస్తువుల విలువ సుమారు రూ.5 లక్షల వరకు ఉంటుందని పేర్కొన్నారు. ఘటనపై కోవెలకుంట్ల పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు బాధితుడు వెల్లడించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Next Story




